Pages

Wednesday, December 24, 2008

లోపాలు లేకుండా లినక్స్ లో తెలుగు అక్షరరూపము

హల్లుతో అంతమయ్యే  పరభాషా పద భాగాలలో హలాంతం విడిగారావటం మరియు విరుగుడు

ఇప్పటి వరకు నేను చూసిన తెలుగు అక్షరరూపాల లోపాలకు విరుగుడు కనగొనటంలో సఫలమైయ్యాను. అవేంటంటే
హల్లుతో అంతమయ్యే పరభాషా పద భాగాలలో హలాంతం విడిగారావటం
దీనికి లోహిత్ ఫాంటులో దోషం కారణం. పోతన2000 ఫాంటుతో సరి అవుతుంది.
ఋత్వము సమస్య మరియు విరుగుడుఋత్వము వేరే వత్తు తర్వాత వస్తే, ముందు ఋత్వం వచ్చి తరువాత వత్తు రావడం
. దీనికి విరుగుడు పాంగోలో కోడు సరిచేసిపెట్టాను.
ఇది కొన్నాళ్లలో విడుదలవుతుంది.

Sunday, December 14, 2008

వికిపీడియా చరిత్ర, పురోగతి మరియు భవిష్యత్తు : జిమ్మీ వేల్స్

 జిమ్మీ వేల్స్ వికిపీడియాలోని ఫొటో
జిమ్మీ వేల్స్ వికీపీడియా గురించి డిసెంబరు 13 న బెంగుళూరులో ఉపన్యసించారు.
ఈ ఉపన్యాసంలో వికిపీడియా పురోగతి, వికీపీడియా ఫౌండేషన్, వికియా, వికియా శోధన గురించి చాలా వివరాలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన సుదీర్ఘ ప్రశ్నోత్తర కార్యక్రమములో వికీపీడియా పనితీరు గురించి, మాధ్యమాల భవిష్యత్తు గురించి వివరించారు. వాటిలో ముఖ్యమైన వాటిగురించి ఈ నివేదిక

వికిపీడియా చరిత్ర మరియు పురోగతి
వికిపీడియా మానవులకు తెలిసిన విజ్ఞానాన్ని నాలుగు రకాల స్వాతంత్రాలు కలుగచేస్తు వాణిజ్య లేక లాభాపేక్ష లేకుండా వాడుకునే లైసెన్సులు ద్వారా ఎవరైనా వాడుకునేందుకు ఏర్పాటు కలిగివుంది. ఇంగ్లీషు భాషలో 25 లక్షల వ్యాసాలతో, 157 భాషలలో వేయి కంటే ఎక్కువ వ్యాసాలతో వుంది. తెలుగు వికీ లో సుమారు 42 వేల వ్యాసాలున్నాయి. ఇటీవల జరిగిన సభలో కేరళ ప్రభుత్వము మళయాళం విఙ్ఞాన సర్వస్వము హక్కులను మార్చి వికీపీడియాలో పొందుపరచటానికి వీలు చేసింది. భారత దేశపు భాషలలో తెలుగులో అత్యధిక వ్యాసాలున్నాయి. ఎక్కువగా వాడే వెబ్ సైట్లలో ప్రపంచంలో 4 వ స్థానంలో, భారతదేశంలో 10 వ స్థానంలో వుంది. ప్రతి నెల 244 మిలియన్ల వేరు వేరు వ్యక్తులు దీనిని వాడుతున్నారు.

వికిపీడియా ఫౌండేషన్ కేవలం 22 మంది ఉద్యోగస్తులు కలిగివుంది. నిష్పాక్షికత, కలుపుగోలుతనం వికిపీడియాకు బలమైన లక్షణాలు.
వికియా
వికిపీడియా లో వున్న సమాచారం కన్నా, కొంతమందికే ఆసక్తి వున్నటువంటి వాటిపై ఎక్కువ సమాచారం వికియాలో చేరుస్తున్నారు. దీనికి మప్పెట్ వికియా ఉదాహరణ.

వికీ శోధన
అంతార్జాలంలో చాలా వరకు మూలాల గోప్యతలేని సాప్టువేరు వున్నా, శోధన గూగుల్, యాహూ, మైక్రోసాఫ్టు లాంటి సంస్థల చేతిలో చిక్కుకు పోయిందన్నారు. వికియా గోప్యతలేని శోధనా యంత్రాన్ని రూపు దిద్దుతున్నారు. దీనిలో ఫలితాలను, వాడుకరులు అభీష్టాల మేరకు నియమాల ఆధారిత విధానాల ద్వారా మారుతుంది. ఈ విధంగా శోధనా ఫలితాలు మరింత మెరుగవుతాయి.

Wednesday, September 24, 2008

ఫైర్‌ఫాక్సు 3.0.2 తెలుగు బీటా విడుదల23 సెప్టెంబరు 2008న ఫైర్‌ఫాక్సు 3.0.2 తెలుగు బీటా విడుదల అయ్యింది.
మొజిల్లా నుండి మీరు తెలుగు ఫైర్‍ఫాక్సును తెచ్చుకొని, మీ కంప్యూటరులో స్థాపించుకొండి. మరిన్ని వివరాల కోసం
ఫైర్‌ఫాక్సు తెలుగు వికీ చూడండి.
కంప్యూటరుపై పూర్తి తెలుగు అనుభూతిని పొంది, మీ అమూల్య సలహాలు, సూచనలు
ఫైర్‌ఫాక్సు మెయిలింగు లిస్టు
కు ఈమెయిల్ ద్వారా తెలియ చేయండి.
2005 నుండి జరిగిన ఈ కృషిలో 1.5 వర్షన్ నుండి పని చేసిన స్వేఛ్చ జట్టు (సునీల్) మరియు, 2.0 వర్షన్ చేసిన సి-డాక్ సంస్థ (రామన్), మరియు 2.0.0.13 మరియు 3.0.2 తెలుగు అనువాదానికి ముఖ్య కర్త అయిన క్రొత్తపల్లి కృష్ణబాబుకి అభివందనాలు.

Saturday, September 6, 2008

ఫైర్‌ఫాక్సు తెలుగు 3.0.2 సెప్టెంబరు 16 న విడుదల

ఫైర్‌ఫాక్సు తెలుగు 3.0.2 సెప్టెంబరు 16 న విడుదల అవుతుంది. ఇప్పుడే కావాలంటే nightly builds స్థానాన్ని చూడండి. దీనిలో build directory లో లినక్సు ఫైలు firefox-3.0.2.te.linux-i686.tar.bz2 వాడండి. మాక్ వాడేవాళ్లు firefox-3.0.2.te.mac.dmg వాడి ప్రయత్నించండి. విండోస్ వారికి ఫైలు వివరము తరువాత పోస్టు చేస్తాను

Sunday, August 31, 2008

తెలుగు లిపి రూపం- లినక్సు విండోస్ కష్టాలు

ఫైర్‌ఫాక్సు 3.0.2 తెలుగు పాక్ తయారుచేసి చూస్తే విండోస్ కి లినక్సుకి పరభాషా పదాలు తెలుగు లో చూపించడంలో తేడాలు కన్పడ్డాయి. అవి ముఖ్యంగా ఒక హల్లు తరువాత ఇంకొక హల్లు చేర్చి అచ్చు లోపించినప్పుడు విండోస్ ఒక విధంగా లినక్సు వేరొక విధంగా రూపుదిద్దుతాయి.
ఉదాహరణకి
fox అనే ఇంగ్లీషు పదాన్ని లిప్యాంతరీకరించినప్పుడు టైపు చేసే విధానము (అర్ధమవటంకోసం అక్షరలమధ్య ఖాళీ ఇవ్వటం జరిగింది) , చూపించే విధానము పరిశీలించండి
టైపు విండోస్ లినక్సు
ఫా క్ స్ zwj ఫాక్స్‍ (సరికాదు) ఫాక్స్‍ (సరి)
ఫా క్ స్ ఫాక్స్ (సరి)ఫాక్స్ (సరికాదు)

ఇలా ఎందుకని జరుగుతందని ఆరా తీస్తే
విండోస్ యూనిస్క్రైబ్ zwj అవసరం లేకుండా రూపు దిద్దితే లినక్సు కి zwj అవసరం కావాలి
ఇంతకీ zwj మొదలు భారతీయ భాషలకు ఉపయోగించలేదు. inscript లో లేదు.
ప్రస్తుతానికి fox లాంటి పదాలకు విండోస్, లినక్సు లో ఒకే విధంగా, ఎబ్బెట్టు లేకుండా కనపడాలంటే ఫాక్సు అని పదంచివరలో అచ్చులోపించకుండా రాసుకోవడమే?