వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. ఇది 19 ఆగష్టు 2005 న మొదటి వ్యాసం అన్నమయ్యకృతి నానాటి_బతుకు_తాత్పర్యము అనే పేజీతో ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులలో అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య,రాకేశ్వర, సురేష్, సుజాత ముఖ్యులు. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చారు.అయితే వీటికి స్కాన్ ఆధారం లేకపోవడం, అచ్చుతప్పులు దిద్దడానికి సమర్ధవంతమైన ప్రక్రియ లేకపోవడంతో వీటి నాణ్యత, సమగ్రతల గురించి వ్యాఖ్యానించలేము. తరువాత వికీసోర్స్ నిర్వహణకి కావలసిన సాంకేతిక మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులు జరిగినవి. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేశారు.
తెలుగు వికీపీడియాలో వ్యాసం అభివృద్ధి చేయటానికి ఉపకరణ ఆధారిత ప్రక్రియలు అంతగా లేవనే చెప్పాలి. కాని వికీసోర్స్ లో పని నిర్దిష్టం (అంటే స్కాన్ కాపీనుండి యూనికోడ్ పాఠ్యం టైపు చేయటం. దానిని కనీసం ఇద్దరితో దోషాలు దిద్దించి. ఆ తరువాత అధ్యాయాలుగా విడకొట్టుట. వాటిని ఎలెక్ట్రానిక్ రూపంలో దింపుకోడానికి ఏర్పాటు చేయటం) కాబట్టి యూరోపియన్ భాషలలో సాఫ్ట్వేర్ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. దానినే అచ్చుదిద్దు పొడిగింత (ఫ్రూఫ రీడ్ ఎక్స్టెన్షన్) అంటారు. దానిని తెలుగు వికీసోర్స్ లో వాడుటకు2010-11 లో చేసిన ప్రయత్నం సమస్యలు ఎదుర్కొని మధ్యలో ఆగిపోయింది. 2012లో నేను ఆ ప్రక్రియ పూర్తి చేశాను.
ఆ పొడిగింతని వాడుకోవటం తెలుసుకోవటానికి తొలి పుస్తకం 'ఆంధ్రుల చరిత్రము' పాఠ్యీకరణ, అధ్యాయల కూర్పు ప్రారంభించాను. కొంత కాలం తరువాత ఇంకొకరు అది పూర్తి చేయడానికి సహకరించారు. భారత డిజిటల్ లైబ్రరీ లో గల పుస్తకాల స్కాన్ల కేటాలాగ్ తెలుగులో లేకపోవడంతో, దాదాపు 20వేల పై చిలుకు పుస్తకాలున్నా అవి శోధనా యంత్రాల ద్వారా దొరికేవి కావు. అందుకని ఆ కేటాలాగ్ లో కొద్ది భాగాన్ని తెలుగుకి మార్చడానికి ప్రయత్నించాను. ఆ తరువాత పవన్ సంతోష్ వికీపీడియా సంస్థ ప్రాజెక్టు నిధులతో మరింత నిర్దిష్ట విధానంలో కేటాలాగ్ ను తెలుగులోకి మార్చాడు. ఇవి గమనిస్తున్న రాజశేఖర్, డిఎల్ ఐ మరియు అర్కైవ్ . ఆర్గ్ లో దొరికే స్వేచ్ఛా నకలు హక్కుల పుస్తకాల స్కాన్ ఫైళ్లను తెలుగు వికీలోకి చేర్చడం మొదలు పెట్టారు. ఆ పనికి తోడ్పడి భాస్కర నాయడు తెలుగు వారి జానపద కళారూపాలు, వృక్షశాస్త్రము పుస్తకాలను యూనీకోడ్ పాఠ్యీకరించారు.మరికొంతమంది అచ్చుదిద్దడంలో తోడ్పడ్డారు.
ఆ తరువాత ఇటీవలి కాలం నాటి రచనలను స్వేచ్ఛా లైసెన్స్ లలో విడుదల చేయించి, వికీసోర్స్ లో చేర్చేదిశగా, ప్రముఖ జర్నలిస్ట్ , పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు గారి ఆత్మకథని పిడిఎఫ్ మూల రూపం నుండి స్వల్ప సవరణలు అవసరమయ్యే విధంగా యాంత్రికంగా వికీసోర్స్ లో నేను, సముదాయ సహకారంతో 2013 లో ప్రవేశ పెట్టడం జరిగింది.
కొంత కాలం విరామం తరువాత, ఇటీవల పరిశీలిస్తే దాదాపు 250 పుస్తకాలు వున్నట్లు కనిపించాయి. సముదాయం పెద్దగా అభివృద్ధి చెందకపోయినా, రాజశేఖర్, శ్రీరామమూర్తి, గుళ్లపళ్లి, భాస్కరనాయుడు, గుళ్లపల్లి గారలు విశేష కృషి ఫలితమేనని తెలిసింది. వాటిని విశ్లేషించిన పిదప 12 దింపుకొనదగిన పుస్తకాలు, 50 అచ్చు ఆమోదం పొందిన పుస్తకాలు, మిగతావి వివిధ అచ్చు దశలలో వున్నట్లుగా తెలిసింది. వాటిని ముఖచిత్రాల కేటాలాగ్ లాగా రూపొందించడం జరిగింది.
గత రెండేళ్లలో గూగుల్ కంప్యూటర్ ద్వారా పాఠ్యం గుర్తింపు పక్రియ బాగా మెరుగవడంతో స్కాన్ నాణ్యతగా వుంటే గూగుల్ OCR వాడి పెద్ద తప్పులు లేకుండా యూనికోడ్ పాఠ్యంలోకి మార్చుకోవచ్చు. దీని గుణగణాలు ఇంకా శాస్త్రయుక్తంగా విశ్లేషించవలసి వుంది. ఒక్కొక్కసారి యూనికోడ్ మార్పిడికి పేజీ పరిమితి వుండడంతో వికీసాంకేతికకారులు కొన్ని సాఫ్ట్వేర్ ఉపకరణాలు తయారుకూడా చేశారు. వాటిని వాడి తెలుగు వికీ మరింత ఉన్నత స్థాయికి చేరాలని కోరిక.
వికీసోర్స్ ఒకసారి సందర్శించి వీటిలో మీ కేవైనా పుస్తకాలు ఇష్టమనిపిస్తే వాటిని దింపుకొని చదివి మీ అభిప్రాయాలు వికీసోర్స్ లో లేక, ఈ బ్లాగ్ పోస్ట్ లో వ్యాఖ్య చేయండి. అలాగే అప్పుడప్పుడు తయారవుతున్న పుస్తకాలు చదివి, మీరు కూడా తయారీ ప్రక్రియలో పాలు పంచుకుంటే మరీ మంచిది.
తెలుగు వికీసోర్స్ ఉచితంగా దింపుకొనగలిగే ఎలెక్ట్రానిక్ పుస్తకాల ప్రదర్శన |