Pages

Showing posts with label Wikipedia. Show all posts
Showing posts with label Wikipedia. Show all posts

Wednesday, January 28, 2015

తెవికీ క్రియాశీలత 2009-2014

గత రెండు సంవత్సరాలలో తెలుగు వికీపీడియా కృషి వేగవంతమైంది. నెలవారీ మరియు సాంవత్సరిక సమావేశాలు,  వికీ శిక్షణ శిబిరాలు, సిఐఎస్, వికీమీడియా ఫౌండేషన్  సహకారంతో చేపట్టిన  వివిధ ప్రాజెక్టులు నాకు తెలిసినవాటిలో ముఖ్యమైనవి. వీటి ఫలితం క్రియాశీలసూచిలో స్పష్టంగా కనబడింది. 2014లో క్రియాశీల సూచి 163.40% పెరిగింది.


డాటాబేస్ మార్పులు క్రింది పటంలో చూడవచ్చు.2014 లో పెరుగుదల135.89 శాతంగా నమోదైంది.
పేజీ అభ్యర్ధనలలో మార్పులు క్రింది పటంలో చూడవచ్చు.పేజీ అభ్యర్ధనల పెరుగుదల 2014 లో 11.66% గా నమోదైంది. 2013 వరకు తగ్గుముఖం పట్టినది 2014లో పెరగటం శుభసూచకం.
 దత్తాంశానికి ఆధారాలు వికీమీడియా ఫౌండేషన్ వారిచే విడుదలైన పేజీఅభ్యర్ధనల గణాంకాలు మరియు మార్పుల గణాంకాలు (28 జనవరి 2015న సేకరించినవి)

Monday, December 9, 2013

తెలుగు వికీపీడియా చదువరి ఇష్టాలలో మార్పులు

ఈనాడు తెలుగు వికీపీడియా 11వ జన్మదినం. ఇదొక పెద్ద మైలురాయి. తెవికీ అభివృద్ధికి వందలాది తెలుగు సభ్యులు సహ వికీలలో లక్షలాది సభ్యులతో ఎంతో కృషి చేశారు. వారందరికి  ధన్యవాదాలు.  ఈ సందర్భంగా  తెలుగు వికీపీడియా చదువరుల ఇష్టాలలో జరుగుతున్న మార్పులు గురించి విశ్లేషణ ఈ  వ్యాసం ప్రధానోద్దేశం.
   వికీటెన్ గుర్తు (కామన్స్ నుండి, తెలుగు రూపం, రహ్మనుద్దీన్)

వికీపీడియా లో ప్రతీది పూర్తి పారదర్శకం. ప్రతి ఒక్క మార్పు నమోదు చేయబడుతుంది. ప్రతి ఒక్క పేజీ అభ్యర్ధన నమోదు అవుతుంది.  ఇప్పటివరకు వికీమీడియా ఫౌండేషన్  ప్రతి నెలా తెవికీలో మార్పులు, వీక్షణల గణాంకాలు విడుదలచేస్తున్నది. వాటి ఆధారంగా  అతి క్రియాశీలక సభ్యులను గుర్తించడం వారిని అభినందించడానికి వీలవుతున్నది. ఆంగ్ల మరియు ఇతర వికీపీడియాలకు ప్రతి వారం వీకీపీడియా లో పేజీల అభ్యర్ధనల గణాంకాలను  విశ్లేషించి అధిక వీక్షణలు గల  25 పేజీలు లాంటి నివేదికలు మనకి కనబడుతాయి. తెలుగు వికీలో అలాంటివి ఇంకా అందుబాటులో రాలేదు. గత ఆరేళ్లకు పైగా కృషిలో  నాలుగేళ్లనుండి వికీ పై అమిత ఆసక్తితో వికీ పరిధిని ప్రక్రియలను అర్థం చేసుకోవడం జరిగింది. ఆ దిశలో ఇతర వికీలలో వాడుతున్న సాంకేతికాలను తెలుగు వికీలో ప్రవేశపెట్టడానికి కృషి చేశాను. ఈ సంవత్సరంలో  ఇంకొంత మంది సహ సభ్యులు వీటిపై దృష్టి పెట్టడం, వీటిపై బ్లాగులు, సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద పెట్టున చేపట్టడం,   ఆనందించాల్సిన విషయం.

డిసెంబర్ 2009 మరియు ఏప్రిల్  2013 లో అధిక అభ్యర్ధనలు గల 1000 పేజీలను ప్రముఖ విభాగాలుగా విశ్లేషించాను. ఆ విభాగాలు క్రింద పటంలో ఇచ్చాను.   తెలుగు వికీలో సినిమాల దిశగా విశేష కృషి జరిగినందున అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో తెలుసు కోవటానికి  సినిమా కొరకు ప్రత్యేక విభాగం ఇవ్వడం జరిగింది.  ప్రత్యేక  లో నిర్వహణకు సహకరించే ప్రత్యేక పేరుబరిలో వుండే పేజీలు, వికీపీడియా విధానాలు, సముదాయ చర్చలను సముదాయంలో చేర్చడం జరిగింది.  పేజీ అభ్యర్ధనల నమోదులో  పేజీ పేరులో దోషాలుంటే  దోషము విభాగంలో చేర్చడం జరిగింది. మొదటి పేజీని సాధారణ విభాగంలో చేర్చడమైనది.

-->
విభాగంవివరం
1ఆంధ్ర ప్రదేశ్
2భాష మరియు సంస్కృతి
3తెలుగు సినిమా
4భారత దేశం మరియు ప్రపంచం
5విజ్ఞానం మరియు సాంకేతికం
6ప్రత్యేక
7సముదాయము
8దోషం
9సాధారణ

డిసెంబర్ 2009 లో 4.0మిలియన్ పేజీ అభ్యర్ధనలు నమోదు కాగా ఏప్రిల్ 2013లో 1.9మి గా వుంది.  అంతర్జాలం మరియు కంప్యూటింగ్  పరికరాలు భారతదేశంలో ఇటీవలి సంవత్సరానికి 30 శాతం అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో ఈ గణాంకాలు తగ్గుట శోచనీయం. అయితే  విభాగాలలో మార్పులు ఏ విధంగా వున్నాయో చూద్దాం.

-->
ఏప్రిల్ 2013

డిసెంబర్ 2009
విభాగం వివరంపేజీ అభ్యర్ధనలు
విభాగం వివరంపేజీ అభ్యర్ధనలు
భాష మరియు సంస్కృతి78986
భారత దేశం మరియు ప్రపంచం67555
భారత దేశం మరియు ప్రపంచం49488
సముదాయము46861
విజ్ఞానం మరియు సాంకేతికం41791
విజ్ఞానం మరియు సాంకేతికం45671
సముదాయము40744
భాష మరియు సంస్కృతి40728
సాధారణ35184
ఆంధ్ర ప్రదేశ్29719
ఆంధ్ర ప్రదేశ్17237
ప్రత్యేక20801
ప్రత్యేక11431
దోషం19942
తెలుగు సినిమా10362
సాధారణ19566
దోషం3893
తెలుగు సినిమా10987
అధిక 1000 (పైవి అన్నీ)210130
అధిక 1000 (పైవి అన్నీ)234275
వికీ మొత్తము1900000
వికీ మొత్తము4000000
అధిక 1000 శాతం11.06%
అధిక 1000 శాతం5.86%

 
వీటిని మనం పరిశీలించినట్లయితే  భాష మరియు సంస్కృతి  నాలుగవ స్థానం నుండి మొదటి స్థానానికి వచ్చింది.భారతదేశం మరియు ప్రపంచం మొదటి స్థానం నుండి రెండవస్థానానికి పడిపోయింది. విజ్ఞానం మరియు సాంకేతికం మూడవ స్థానంలో కొనసాగింది.  ఆంధ్రప్రదేశ్  5 వ స్థానం నుండి  ఆరవ స్థానానికి పడిపోయింది. మొత్తం మీద చెప్పుకోవాలంటే  భాష మరియు సంస్కృతి గురించి తెలుసుకోవటానికి తెలుగు వికీని ప్రజలు వాడుతున్నారు అనుకోవాలి. వికీపీడియా పూర్తి విజ్ఞాన సర్వస్వమైనా  చదువరుల అభిరుచుల కనువుగా  ప్రాధాన్యతలు  అమలు చేయటానికి పై గణాంకాలు ఉపయోగపడగలవు. వీటిని మరింత విశ్లేషించే వారి సౌకర్యం కొరకు మూల దత్తాంశాన్ని గూగుల్ డాక్స్ గా పంచుకోవటమైనది.


Friday, July 26, 2013

మొబైల్ లో ఉచితంగా తెలుగు వికీపీడియా వీక్షణ

ఎయిర్సెల్ ఉచిత వికీపీడియా హోమ్ పేజీ(ఊహాచిత్రం)
భారతదేశంలో   చాలా కాలంగా ఎదురుచూస్తున్న  మొబైల్ ఫోన్ లో ఉచిత వికీపీడియా  జులై 25, 2013 న వికీమీడియా ఫౌండేషన్  మరియు ఎయిర్సెల్   ప్రకటనతో విడుదలైంది. దీనితో ఎయిర్సెల్ 60 మిలియన్ మొబైల్ చందాదారులతో పాటు ఇప్పటికి  ప్రపంచవ్యాప్తంగా  470 మిలియన్ల మందికి  ఉచిత వికీపీడియా అందుబాటులోకివచ్చింది. ఈ పోస్ట్ లో నేను ఉచిత వికీపిడియా వినియోగం గురించి  మరియు తెలుగు వాడుకరులకు అవసరమైన వివరాలను తెలుపుతాను.


స్మార్ట్ ఫోన్ల గల  ఎయిర్సెల్ ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులు ఇంగ్లీష్ వికీపీడియా (http://m.wikipedia.org) లేదా తెలుగు
వికీపీడియాను (http://te.m.wikipedia.org) వారి విహరిణిసహాయంతో దర్శించవచ్చు.   స్మార్ట్ ఫోన్లు అప్రమేయంగా ఆంగ్ల  వాడుకరి వ్యవస్థ కలిగివుంటాయి కాబట్టి వినియోగదారులు సులభంగా ఇంగ్లీష్ వికీపీడియా  వాడవచ్చు.  స్థానికభాషలో వాడేవారు  మొబైల్ యొక్క స్థానికభాష ప్రదర్శన సామర్ధ్యాన్ని పరీక్ష చేసుకొని  ఆ తరువాత  స్థానిక భాష   కీబోర్డులు అమర్చుకుంటే  వాళ్లభాషలో వికీపీడియాను వాడటం సులభంమవుతుంది.    ఆండ్రాయిడ్   వెర్షన్ 4.1 (జూలై 2012)  లో  హిందీ భాష తోడ్పాటు  ప్రాథమిక స్థాయిలో  ప్రారంభమైంది.  తాజా వెర్షన్ 4.3 (జూలై 2013) లో పూర్తి తోడ్పాటు కలిగించబడింది. శామ్సంగ్ లాంటి కొన్ని సంస్థలు  2.3.7 వెర్షన్ (ఫిబ్రవరి 2011) నుండే భారతీయ భాషల  ప్రదర్శనకు  మద్దతు కలిగిన  ఫోన్లు అందుబాటులోకి తెచ్చాయి.   ప్రభుత్వం ప్రామాణిక ఇన్స్క్రిప్ట్  పద్దతిలో వుండే మరియు  భారతీయ భాషలతో  సహా ప్రపంచంలో చాలా భాషలకు తోడ్పాటు కలిగిన  మల్టీలింగ్  కీ బోర్డు ను అమర్చుకుంటే భారతీయ భాషలలో  వికీపీడియా వీక్షించడం సులభం అవుతుంది. 

ఎయిర్టెల్ ఫ్రీజోన్ హోమ్ పేజీ
ఎయిర్సెల్ మాత్రమే కాక ఎయిర్టెల్ వినియోగదారులు కూడా  ఉచితంగా వికీపీడియా  వీక్షించవచ్చు.  ఇది గూగుల్ తో ఒప్పంద ప్రకారం  ఉచిత ఇంటర్నెట్ ప్రచారంలో భాగంగా  జూన్ 2013 లో  విడుదలైంది.  దీనిలో గూగుల్  శోధన, గూగూల్ ఇమెయిల్, ప్లస్ సేవలు  ఉచితంగా లభిస్తాయి.  దీనికొరకు  ఎయిర్టెల్  ఫ్రీజోన్  హోమ్ పేజీ   (http://airtel.in/freezone)దర్శించాలి. దీనిలో  జిమెయిల్ మరియు గూగుల్ శోధన మరియు గూగుల్ ప్లస్  బటన్లువుంటాయి.  సమాచారం కోసం శోధించితే  శోధన ఫలితాలలో  సంబంధిత వికీపీడియా లింక్ క్లిక్ చేసి, వికీపీడియా పేజీ చూడవచ్చు. వినియోగదారు ఇంకొకవికీపీడియా పేజీ ని లేదా  బాహ్య లింక్ గాని చేరాలనుకుంటే  డేటా ఖర్చుల గురించి  హెచ్చరిక కనబడుతుంది. వాడుకరి కొనసాగవచ్చు లేదా మునుపటి పేజీకి తిరిగి వెళ్లవచ్చు.  కావలసిన పేజీ నిఉచితంగా సందర్శించటానికి, వినియోగదారు  ఫ్రీజోన్ లో మళ్ళీ శోధించవచ్చు.  నెల రోజుల
తెలుగులో వెతకటం
లో  1GB  డాటా  ఉచితం.  ఎయిర్టెల్ ఫ్రీజోన్  హోమ్ పేజీ పలు భారతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
వికీపీడియా జీరో ప్రారంభమై సంవత్సరంపైగా గడిచింది. ఈ కాలంలో   17 దేశాలలో ఉచితవికీపీడియాను అందచేయగలిగింది. ఉపయోగించేవారి గణాంకాలు ప్రయోగం  ప్రారంభ నెలల్లో వేగంగా పెరిగుతున్నప్పటికి   ఆతరువాత కాలంలో స్థిరంగా వుంటున్నాయి.  భారతదేశంలో ఫలితాలు  ఎలా వుంటాయి మరియు   స్థానిక భాష వికీపీడియా పేజీ వీక్షణలు  పెరుగుతాయా అన్నవి ప్రస్తుతానికి ఆసక్తికరమైన ప్రశ్నలు. 

ఇవీ చూడండి 
శామ్సంగ్ గేలక్సీ ఏస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో తెలుగు
గమనిక:ఇది మూలపు ఆంగ్ల ప్రతినుండి గూగుల్ అనువాద ఉపకరణంతో తెలుగులోకి మార్చి ఆతరువాత మెరుగుపరచబడినది.

Monday, January 14, 2013

తెవికీ  క్రియాశీల సూచి 2012

తెవికీ క్రియాశీల సూచి 2012  కు 2088 గా నమోదైంది. అనగా 16.87 శాతం తగ్గుదల. మార్పులు 72.5k గా వీక్షణలు 28.8మిలియన్లగా నమోదయ్యాయి, క్రితం సంవత్సరాలతో పోల్చిన పటం క్రిందచూడవచ్చు.
ఇవీ చూడండి: క్రితం సంవత్సరం విశ్లేషణ 21 జనవరి 2013: 2011 గణాంకాలలోని తప్పుని సరిదిద్దడమైనది.

Sunday, February 26, 2012

తెవికీ క్రియాశీల సూచి

గణకీకృత తెలుగుకు ఒక సూచికను తయారుచెయ్యాలన్న ఆలోచన కొన్నాళ్లుగా వుంది. దీనికి ఎటువంటి సమాచారంవాడాలి నిర్ణయించటం కష్టమైంది. కొన్ని సూచికలు మెయిలింగ్ లిస్టులలో చర్చలు, చందాదారుల గణాంకాలు వాడాను కాని, అవి సమగ్రతను చేకూర్చలేవు. అందుకని తెలుగులో ముఖ్యమైన తెవికీనే గురిగా మార్పులు, మరియు వీక్షణల లబ్దాన్ని సూచిగా వాడుకోవచ్చు అనిపించింది. దానిని క్రింద పటంలో చూడండి. దీనికి వాడిన దత్తాంశాన్ని క్రిందచూడవచ్చు.
సంవత్సరంవీక్షణలు(పదిలక్షలలో) మార్పులు (వేలల్లో) తెవికీ క్రియాశీలసూచి
201129.984.12,515
201029.969.12,066
200926.988.42,378
దీని ప్రకారం 2010 కంటే 2011 మెరుగుగా (21.71శాతం పెరుగుదలతో)వుంది.ఇది ఇలాగే వృద్ధిచెందుటకు అందరి సహకారం అవసరం.
ఇవీ చూడండి:తెలుగు వికీపీడియా వీక్షణలు 2011
జనవరి 21,2013: గణాంకాలలో మార్పులు లో జరిగిన తప్పుని సరిదిద్దడమైనది.

Saturday, February 25, 2012

తెలుగు వికీపీడియా 2011 వీక్షణలు, మార్పులు

తెలుగు వికీపీడియా 2011 వీక్షణలు దేశాలవారీగా వికీపీడియ ప్రకటిస్తుంది. వాటి విశ్లేషణ ఫలితాలు ఈ విధంగా వున్నాయి. భారత్ 80 శాతం, అమెరికా 6 శాతం, ఇతరాలు 14 శాతంగా వున్నాయి. ఇది మొత్తం వికీపీడియా వీక్షణలలో 0.004 శాతం. ఇంగ్లీషువికీపీడియా 47శాతంగా వుందని గమనించండి. తెలుగు వికీపీడీయా వీక్షణలు గతమూడు సంవత్సరాల నుండి ఈ విధంగా వున్నాయి. దీనినబట్టి చూస్తే 2011లో పెరుగదల కన్పించలేదు కాని, 2010తో సమానంగా వున్నాయి.పెరుగుదలలేకపోవడం ఆందోళన కలిగించేవిషయం.
తెలుగు వికీపీడియా లో మార్పులు (వేలల్లో)(అన్ని సంపాదకులు, బాట్లు) ఈ విధంగా వున్నాయి. 2011లో 2010నుండి 13.69 శాతం తరుగుదల కనపడింది.
తా.క:21జనవరి 2013:2011గణాంకాలలో జరిగిన తప్పుని సరిదిద్దడమైనది.