Pages

Sunday, June 27, 2010

ఐఒఎస్ 4 (ఐఫోన్ 4) తో తెలుగు

తెలుగుని స్మార్ట్ ఫోన్ లో చూసుకోవాలని అసక్తిగల వారందరికి శుభవార్త. ఐఫోన్ 4 తో యూనికోడ్ ఫాంటుల ను చూపించకల సౌకర్యం వుంది. అందుకని తెలుగు ఇతర భారతీయ భాషల అంతర్జాల స్థలాలు చూడవచ్చు. తెలుగు వికీపీడియా లాంటి సైట్లలో, లేక గూగుల్ సైట్లలో తెలుగు లిప్యంతరీకరణ పరికరము ద్వారా తెలుగు టైపు చేయవచ్చు.(మొబైల్ కోసం కాని దీనికి సాధారణ కంప్యూటర్ కి వాడే గూగుల్ అనువర్తనం వాడాలి) (అప్లికేషన్)  సఫారీ విహరిణిలో తెలుగు చాలా వరకు బాగానే చూపిస్తున్నది.

సెల్ ఫోను ఉత్పత్తి దారులు తెలుగు మాత్రమే తెలిసిన వారికోసం, చర్యల వరుసలు(మెనూలు), సంక్షిప్త వార్త (ఎస్ఎమ్ఎస్) వరకు తెలుగు సౌకర్యం కలిపించారు. ఐతే, వార్త అందుకునే వారు, అటువంటి తయారు దారు ఫోను కలిగి వుంటేనే, వాడుకోటానికి వీలు కలిగేది. వీటిని అధిగమించడానికి  ఈమధ్య జావా అనువర్తనాలు అందుబాటులోకి వచ్చాయి కాని అవి ఖర్చుతో కూడుకున్నవి.





ఆ తరువాత మన భాషల వార్తాపత్రికలు సెల్ ఫోన్ లో కనబడటానికి పదాలను బొమ్మలుగా మార్చి పంపే పద్ధతి (2005 ముందు పర్సనల్ కంప్యూటర్ లలో వాడినది) వాడారు. వీటికి అనువర్తనం (ఉచితం) స్థాపించుకోవాలి. వార్తలు ప్రత్యేకంగా (మామూలు వెబ్సైట్ కి భిన్నంగా) రాయాలి. ఇప్పుడు యూనికోడ్ సపోర్టుతో సెల్ ఫోన్ వచ్చేసరికి, మామూలు వెబ్సైటు చూడగలిగే అవకాశం వచ్చింది.

ఐతే, ఐఫోన్ ఖరీదు (రు 30,000/$ 600) దానికి అవసరమయ్యే డాటా ప్లాన్లు ఖర్చు ఎక్కువగా వుండటంతో, సామాన్య సెల్ ఫోన్ వాడుక దారుల కొరకు అందని పండే. ఆండ్రోయిడ్ లేక నోకియా వారి ఫోనులలో ఈ సౌకర్యం వచ్చేవరకు లేక ఆపిల్ ఫోన్లు ధర తగ్గే వరకు వేచి చూడాలి.

4 comments:

Unknown said...

నీలి background నల్లని అక్షరాలు సరిగ్గా కనపడటంలేదు.

భవదీయుడు,
శర్మ.

Arjun said...

బొమ్మలు పెద్దవిగా చూడటానికి రెండు క్లిక్కులు చేయండి. ఐఫోన్ లో మీకు కావలసిన అక్షర పరిమాణం కొరకు జూమ్ చేయవచ్చు.

టైపింగు బొమ్మలో నల్లగా వున్న అక్షరాల గురించి ఐతే, పై బొమ్మ పారదర్శకత సున్న కాదు కాబట్టి అలా వుంది .

శశికాంత్ said...

నాకు ఐఫోన్ 4 తెలుగు ఫాంట్ కావాలి. మీరు అప్లోడ్ చేస్తే చాలా సంతోషిస్తాను. అలాగే .plist ఫైల్ ని కూడా అప్లోడ్ చేయండి. నేను ఆ రెండిటినీ నా దాంట్లోకి కాపీ చేసుకుంటాను. నాది ఐఫోన్ 3 మాత్రమే. అందువల్ల అందులో తెలుగు ఫాంట్ లేదు. మీరు నేను చెప్పిన రెండు ఫైల్స్ ని అప్లోడ్ చేస్తే సంతోషం. విండోస్ ఫాంట్ లు ఐఫోన్ లో పనిచేయవు. కనుక ఐఫోన్ 4 ఫాంట్ మాత్రమే కావాలి

Arjun said...

శషికాంత్ గారు,
నేను పరీక్ష చేయటానికి వేరొకరిది వాడాను. అందుకని నాకు ఆ ఫైళ్లు అందుబాటులో లేవు. క్షమించాలి.
ధన్యవాదాలు
అర్జున