Pages

Sunday, October 30, 2011

శామ్సంగ్ గేలక్సీ ఏస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో తెలుగు


From TeluguWikipediaOnSamsungAceSmartPhone


దాదాపు 15 నెలల క్రిందట ఐఫోన్ లో తెలుగు  విషయమై బ్లాగ్ రాశాను. అప్పటినుండి తక్కువ ధరలో తెలుగు వెబ్ పేజీలు చూపించగల మొబైల్ ఫోన్ అన్వేషణ జరుగుతూనే వుంది. నోకియా హిందీ ఫోన్ ని విడుదలచేసింది అయితే తెలుగు ఇతర భాషల విడుదలను పక్కకు పెట్టింది. ఇటీవల మొబైల్ స్టోర్ లో క్రియాశీలమైన ఫోన్ పరిశీలించగా శామ్సంగ్  ఏస్ లో తెలుగు చాలా వరకు బాగా కనబడింది. ఇంకేముంది అంత  తక్కువధరకు కాకపోయినా నా అన్వేషణ ఫలించింది. ఏస్ ని కొని వాడటం పరిశీలించాను. తెలుగు చాలావరకు దోషాలు లేకుండా వుంది. ఉదాహరణకు 'టి' లో గుడి   సరియైన స్థానంలో రావటంలేదు. కాని తెలుగు భాషలో ఉత్తరాలు అవీ చూడటానికి చక్కగా వుంది.  గూగుల్ భాషపరికరాలు వాడి,  గ్యాన్పాడ్ ద్వారా గూగుల్ లిప్యంతరీకరణం లేక ఇన్స్క్రిప్ట్ వాడి తెలుగు టైప్ చేయడం కూడా వీలవుతుంది. ఇక తెలుగు టైపింగ్ కు  ప్రామాణిక  కీబోర్డు నమూనా రూపొందితే పూర్తి తెలుగు లో పోన్ వాడటం సాధ్యపడుతుంది. ఈ విషయమై ఐఇఇఇ (ఇంజనీర్ల వృత్తిపర సంస్థ) ద్వారా పని జరుగుతున్నది.

7 comments:

Anonymous said...

శుభవార్త!

కానీ అది గౌతమి ఖతిలా ఉంది. వాళ్ళు లోహిత్‌ని ఉపయోగించి ఉండాల్సింది.

అన్నట్టు, మీ బ్లాగులో వికీ కౌంట్‌డౌన్ విడ్జెట్టుకి ఈ పేజీలోని కోడుని ఉపయోగించగలరా? అది అందమైన విడ్జెట్టుని ఇస్తుంది. ప్రస్తుతం మీరు వాడుతున్నది ప్రయోగ దశ లోనిది.

Anand said...

నోకియా 2700 బేసిక్ పోనులో కూడా తెలుగు కనిపిస్తోంది.

admin said...

వీవెన్,
ధన్యవాదాలు.
ఖతి చదవటానికి అంత ఇబ్బందిగా లేదు. రూపు సమస్య ఖతికి సంబంధించినది కాదనుకుంటాను.
తెవికీ విడ్జెట్ మార్చాను.

ఆనంద్,
మామాలు ఫోన్లలో తెలుగు చాలాకాలం నుండి వుంది. ఉదాహరణకు నా ఇంగ్లీషు బ్లాగ్ పోస్టు లోని మొదటిలింకు చూడండి

admin said...

తెలుగు టైపు చేయడానికి (ఇన్స్క్రిప్ట్ రూపంలో) ఆండ్రాయిడ్ మార్కెట్ లోని మల్టిలంగ్ కీ బోర్డు (multiling keyboard)ఉపకరణం . దానికి సంబంధించిన నల్లమోతు శ్రీధర్ గారి బ్లాగ్ పోస్టు

admin said...

తక్కువ ఖర్చు శామ్సంగ్ ఫిట్ s5670 కూడా తెలుగు రూపుదిద్దటం, ప్రవేశపెట్టటం తోడ్పాటు కలిగి వుందని నల్లమోతు శ్రీధర్ గారు తన వీడియో పాఠం ద్వారా తెలిపారు.

Unknown said...

i am trying to display telugu news in android mobile but it looks not good please help me........

Arjun said...

మల్లికార్జున్ గారు,
మీరు వాడే ఫోన్ మోడల్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్, ఎక్కడ కొన్నది, ప్రస్తుతము తెలుగు తెరపట్లు తెలియచేస్తే సహాయం చేయటానికి వీలవుతుంది.