Pages

Sunday, February 26, 2012

తెవికీ క్రియాశీల సూచి

గణకీకృత తెలుగుకు ఒక సూచికను తయారుచెయ్యాలన్న ఆలోచన కొన్నాళ్లుగా వుంది. దీనికి ఎటువంటి సమాచారంవాడాలి నిర్ణయించటం కష్టమైంది. కొన్ని సూచికలు మెయిలింగ్ లిస్టులలో చర్చలు, చందాదారుల గణాంకాలు వాడాను కాని, అవి సమగ్రతను చేకూర్చలేవు. అందుకని తెలుగులో ముఖ్యమైన తెవికీనే గురిగా మార్పులు, మరియు వీక్షణల లబ్దాన్ని సూచిగా వాడుకోవచ్చు అనిపించింది. దానిని క్రింద పటంలో చూడండి. దీనికి వాడిన దత్తాంశాన్ని క్రిందచూడవచ్చు.
సంవత్సరంవీక్షణలు(పదిలక్షలలో) మార్పులు (వేలల్లో) తెవికీ క్రియాశీలసూచి
201129.984.12,515
201029.969.12,066
200926.988.42,378
దీని ప్రకారం 2010 కంటే 2011 మెరుగుగా (21.71శాతం పెరుగుదలతో)వుంది.ఇది ఇలాగే వృద్ధిచెందుటకు అందరి సహకారం అవసరం.
ఇవీ చూడండి:తెలుగు వికీపీడియా వీక్షణలు 2011
జనవరి 21,2013: గణాంకాలలో మార్పులు లో జరిగిన తప్పుని సరిదిద్దడమైనది.

Saturday, February 25, 2012

తెలుగు వికీపీడియా 2011 వీక్షణలు, మార్పులు

తెలుగు వికీపీడియా 2011 వీక్షణలు దేశాలవారీగా వికీపీడియ ప్రకటిస్తుంది. వాటి విశ్లేషణ ఫలితాలు ఈ విధంగా వున్నాయి. భారత్ 80 శాతం, అమెరికా 6 శాతం, ఇతరాలు 14 శాతంగా వున్నాయి. ఇది మొత్తం వికీపీడియా వీక్షణలలో 0.004 శాతం. ఇంగ్లీషువికీపీడియా 47శాతంగా వుందని గమనించండి. తెలుగు వికీపీడీయా వీక్షణలు గతమూడు సంవత్సరాల నుండి ఈ విధంగా వున్నాయి. దీనినబట్టి చూస్తే 2011లో పెరుగదల కన్పించలేదు కాని, 2010తో సమానంగా వున్నాయి.పెరుగుదలలేకపోవడం ఆందోళన కలిగించేవిషయం.
తెలుగు వికీపీడియా లో మార్పులు (వేలల్లో)(అన్ని సంపాదకులు, బాట్లు) ఈ విధంగా వున్నాయి. 2011లో 2010నుండి 13.69 శాతం తరుగుదల కనపడింది.
తా.క:21జనవరి 2013:2011గణాంకాలలో జరిగిన తప్పుని సరిదిద్దడమైనది.

తెలుగుపదం చర్చల గణాంకాలు

2011లో అంతర్జాల తెలుగు విశ్లేషణలో భాగంగా తెలుగుపదం జట్టు చర్చల గణాంకాలను పరిశీలించండి 2011లో తెలుగుపదంలో చర్చలు ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో అనగా 1129 కు చేరాయి.అంటే క్రితం సంవత్సరంతో పోల్చితే దాదాపు 50 శాతం పెరుగుదల ఇది శుభపరిణామమే, తెలుగులో ఆసక్తి పెరుగుతున్నదనటానికి ఇది ఒక సూచిక.

ఫైర్ఫాక్స్ తెలుగు గణాంకాలు 2011

ఫైర్ఫాక్స్ తెలుగు  వాడుకరులు గణాంకాలు 2011 చివరి వారానికి ఈ క్రింది విధంగా వున్నాయి.
సంవత్సర క్రిందటి గణాంకాలతో పోల్చితే  దాదాపు 62 శాతం పెరుగుదలతో 353  స్థాయికి చేరుకున్నాయి.
భారతదేశంలోని వాడుకరుల సంఖ్య క్రిందటి సంవత్సరం స్థాయి అంటే దాదాపు 80 శాతంలో వుంది.
చూడండి: 2010 గణాంకాల విశ్లేషణ

ఫైర్ఫాక్స్ తెలుగు ముద్రాక్షర తనిఖీ విస్తరణ సంవత్సరం పూర్తి

ఈ రోజు తెవికీ లోని వీక్షణ జాబితాలో ఫైర్ఫాక్స్ వ్యాసంలో మార్పులు చూస్తూ, ఫైర్ఫాక్స్ ముద్రాక్షర తనిఖీ పేజీ చూడడం జరిగింది. ఇది విడుదలై సంవత్సరం గడిచింది. ఫైర్ఫాక్స్ కొత్త రూపాంతరాలకు సరిపోలడానికి మూడు  విడుదలలు చేశాను. అయితే పనితనంలో మార్పులేదు.  2011 సంవత్సరం గణాంకాలు పరిశీలించాను(బొమ్మ చూడండి).  1,897 సార్లు దీనిని వాడుకరులు దింపుకున్నారు. సరాసరి 54 మంది రోజు వాడుతున్నారు. నేను చేసిన కొద్ది కృషి కొంతమందికైనా సహయంగా వుందన్న సంతృప్తి కలిగింది. ఎక్కువ మంది విండోస్ వాడుకరులు అనుకోండి.

దీనిని మెరుగుచేయటంకోసం మరింత విస్తారమైన తెలుగు పదజాబితా కోసం ప్రయత్నించాను కాని ఫలించలేదు. వేరే పద్ధతిలో తనిఖీ చేసే ఉపకరణాలు   తెలుగు విజయం ద్వారా త్వరలో అందుబాటులోకి రావాలని కోరుచున్నాను.