![]() |
From TeluguWikipediaOnSamsungAceSmartPhone |
దాదాపు 15 నెలల క్రిందట ఐఫోన్ లో తెలుగు విషయమై బ్లాగ్ రాశాను. అప్పటినుండి తక్కువ ధరలో తెలుగు వెబ్ పేజీలు చూపించగల మొబైల్ ఫోన్ అన్వేషణ జరుగుతూనే వుంది. నోకియా హిందీ ఫోన్ ని విడుదలచేసింది అయితే తెలుగు ఇతర భాషల విడుదలను పక్కకు పెట్టింది. ఇటీవల మొబైల్ స్టోర్ లో క్రియాశీలమైన ఫోన్ పరిశీలించగా శామ్సంగ్ ఏస్ లో తెలుగు చాలా వరకు బాగా కనబడింది. ఇంకేముంది అంత తక్కువధరకు కాకపోయినా నా అన్వేషణ ఫలించింది. ఏస్ ని కొని వాడటం పరిశీలించాను. తెలుగు చాలావరకు దోషాలు లేకుండా వుంది. ఉదాహరణకు 'టి' లో గుడి సరియైన స్థానంలో రావటంలేదు. కాని తెలుగు భాషలో ఉత్తరాలు అవీ చూడటానికి చక్కగా వుంది. గూగుల్ భాషపరికరాలు వాడి, గ్యాన్పాడ్ ద్వారా గూగుల్ లిప్యంతరీకరణం లేక ఇన్స్క్రిప్ట్ వాడి తెలుగు టైప్ చేయడం కూడా వీలవుతుంది. ఇక తెలుగు టైపింగ్ కు ప్రామాణిక కీబోర్డు నమూనా రూపొందితే పూర్తి తెలుగు లో పోన్ వాడటం సాధ్యపడుతుంది. ఈ విషయమై ఐఇఇఇ (ఇంజనీర్ల వృత్తిపర సంస్థ) ద్వారా పని జరుగుతున్నది.