ఈనాడు తెలుగు వికీపీడియా 11వ జన్మదినం. ఇదొక పెద్ద మైలురాయి. తెవికీ అభివృద్ధికి వందలాది తెలుగు సభ్యులు సహ వికీలలో లక్షలాది సభ్యులతో ఎంతో కృషి చేశారు. వారందరికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలుగు వికీపీడియా చదువరుల ఇష్టాలలో జరుగుతున్న మార్పులు గురించి విశ్లేషణ ఈ వ్యాసం ప్రధానోద్దేశం.
వికీపీడియా లో ప్రతీది పూర్తి పారదర్శకం. ప్రతి ఒక్క మార్పు నమోదు చేయబడుతుంది. ప్రతి ఒక్క పేజీ అభ్యర్ధన నమోదు అవుతుంది. ఇప్పటివరకు వికీమీడియా ఫౌండేషన్ ప్రతి నెలా తెవికీలో మార్పులు, వీక్షణల గణాంకాలు విడుదలచేస్తున్నది. వాటి ఆధారంగా అతి క్రియాశీలక సభ్యులను గుర్తించడం వారిని అభినందించడానికి వీలవుతున్నది. ఆంగ్ల మరియు ఇతర వికీపీడియాలకు ప్రతి వారం వీకీపీడియా లో పేజీల అభ్యర్ధనల గణాంకాలను విశ్లేషించి అధిక వీక్షణలు గల 25 పేజీలు లాంటి నివేదికలు మనకి కనబడుతాయి. తెలుగు వికీలో అలాంటివి ఇంకా అందుబాటులో రాలేదు. గత ఆరేళ్లకు పైగా కృషిలో నాలుగేళ్లనుండి వికీ పై అమిత ఆసక్తితో వికీ పరిధిని ప్రక్రియలను అర్థం చేసుకోవడం జరిగింది. ఆ దిశలో ఇతర వికీలలో వాడుతున్న సాంకేతికాలను తెలుగు వికీలో ప్రవేశపెట్టడానికి కృషి చేశాను. ఈ సంవత్సరంలో ఇంకొంత మంది సహ సభ్యులు వీటిపై దృష్టి పెట్టడం, వీటిపై బ్లాగులు, సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద పెట్టున చేపట్టడం, ఆనందించాల్సిన విషయం.
డిసెంబర్ 2009 మరియు ఏప్రిల్ 2013 లో అధిక అభ్యర్ధనలు గల 1000 పేజీలను ప్రముఖ విభాగాలుగా విశ్లేషించాను. ఆ విభాగాలు క్రింద పటంలో ఇచ్చాను. తెలుగు వికీలో సినిమాల దిశగా విశేష కృషి జరిగినందున అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో తెలుసు కోవటానికి సినిమా కొరకు ప్రత్యేక విభాగం ఇవ్వడం జరిగింది. ప్రత్యేక లో నిర్వహణకు సహకరించే ప్రత్యేక పేరుబరిలో వుండే పేజీలు, వికీపీడియా విధానాలు, సముదాయ చర్చలను సముదాయంలో చేర్చడం జరిగింది. పేజీ అభ్యర్ధనల నమోదులో పేజీ పేరులో దోషాలుంటే దోషము విభాగంలో చేర్చడం జరిగింది. మొదటి పేజీని సాధారణ విభాగంలో చేర్చడమైనది.
-->![]() |
వికీటెన్ గుర్తు (కామన్స్ నుండి, తెలుగు రూపం, రహ్మనుద్దీన్) |

విభాగం | వివరం |
1 | ఆంధ్ర ప్రదేశ్ |
2 | భాష మరియు సంస్కృతి |
3 | తెలుగు సినిమా |
4 | భారత దేశం మరియు ప్రపంచం |
5 | విజ్ఞానం మరియు సాంకేతికం |
6 | ప్రత్యేక |
7 | సముదాయము |
8 | దోషం |
9 | సాధారణ |
డిసెంబర్ 2009 లో 4.0మిలియన్ పేజీ అభ్యర్ధనలు నమోదు కాగా ఏప్రిల్ 2013లో 1.9మి గా వుంది. అంతర్జాలం మరియు కంప్యూటింగ్ పరికరాలు భారతదేశంలో ఇటీవలి సంవత్సరానికి 30 శాతం అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో ఈ గణాంకాలు తగ్గుట శోచనీయం. అయితే విభాగాలలో మార్పులు ఏ విధంగా వున్నాయో చూద్దాం.
-->
ఏప్రిల్ 2013 | డిసెంబర్ 2009 | |||
విభాగం వివరం | పేజీ అభ్యర్ధనలు | విభాగం వివరం | పేజీ అభ్యర్ధనలు | |
భాష మరియు సంస్కృతి | 78986 | భారత దేశం మరియు ప్రపంచం | 67555 | |
భారత దేశం మరియు ప్రపంచం | 49488 | సముదాయము | 46861 | |
విజ్ఞానం మరియు సాంకేతికం | 41791 | విజ్ఞానం మరియు సాంకేతికం | 45671 | |
సముదాయము | 40744 | భాష మరియు సంస్కృతి | 40728 | |
సాధారణ | 35184 | ఆంధ్ర ప్రదేశ్ | 29719 | |
ఆంధ్ర ప్రదేశ్ | 17237 | ప్రత్యేక | 20801 | |
ప్రత్యేక | 11431 | దోషం | 19942 | |
తెలుగు సినిమా | 10362 | సాధారణ | 19566 | |
దోషం | 3893 | తెలుగు సినిమా | 10987 | |
అధిక 1000 (పైవి అన్నీ) | 210130 | అధిక 1000 (పైవి అన్నీ) | 234275 | |
వికీ మొత్తము | 1900000 | వికీ మొత్తము | 4000000 | |
అధిక 1000 శాతం | 11.06% | అధిక 1000 శాతం | 5.86% |
![]() |
వీటిని మనం పరిశీలించినట్లయితే భాష మరియు సంస్కృతి నాలుగవ స్థానం నుండి మొదటి స్థానానికి వచ్చింది.భారతదేశం మరియు ప్రపంచం మొదటి స్థానం నుండి రెండవస్థానానికి పడిపోయింది. విజ్ఞానం మరియు సాంకేతికం మూడవ స్థానంలో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ 5 వ స్థానం నుండి ఆరవ స్థానానికి పడిపోయింది. మొత్తం మీద చెప్పుకోవాలంటే భాష మరియు సంస్కృతి గురించి తెలుసుకోవటానికి తెలుగు వికీని ప్రజలు వాడుతున్నారు అనుకోవాలి. వికీపీడియా పూర్తి విజ్ఞాన సర్వస్వమైనా చదువరుల అభిరుచుల కనువుగా ప్రాధాన్యతలు అమలు చేయటానికి పై గణాంకాలు ఉపయోగపడగలవు. వీటిని మరింత విశ్లేషించే వారి సౌకర్యం కొరకు మూల దత్తాంశాన్ని గూగుల్ డాక్స్ గా పంచుకోవటమైనది.