Pages

Sunday, December 14, 2008

వికిపీడియా చరిత్ర, పురోగతి మరియు భవిష్యత్తు : జిమ్మీ వేల్స్

 జిమ్మీ వేల్స్ వికిపీడియాలోని ఫొటో
జిమ్మీ వేల్స్ వికీపీడియా గురించి డిసెంబరు 13 న బెంగుళూరులో ఉపన్యసించారు.
ఈ ఉపన్యాసంలో వికిపీడియా పురోగతి, వికీపీడియా ఫౌండేషన్, వికియా, వికియా శోధన గురించి చాలా వివరాలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన సుదీర్ఘ ప్రశ్నోత్తర కార్యక్రమములో వికీపీడియా పనితీరు గురించి, మాధ్యమాల భవిష్యత్తు గురించి వివరించారు. వాటిలో ముఖ్యమైన వాటిగురించి ఈ నివేదిక

వికిపీడియా చరిత్ర మరియు పురోగతి
వికిపీడియా మానవులకు తెలిసిన విజ్ఞానాన్ని నాలుగు రకాల స్వాతంత్రాలు కలుగచేస్తు వాణిజ్య లేక లాభాపేక్ష లేకుండా వాడుకునే లైసెన్సులు ద్వారా ఎవరైనా వాడుకునేందుకు ఏర్పాటు కలిగివుంది. ఇంగ్లీషు భాషలో 25 లక్షల వ్యాసాలతో, 157 భాషలలో వేయి కంటే ఎక్కువ వ్యాసాలతో వుంది. తెలుగు వికీ లో సుమారు 42 వేల వ్యాసాలున్నాయి. ఇటీవల జరిగిన సభలో కేరళ ప్రభుత్వము మళయాళం విఙ్ఞాన సర్వస్వము హక్కులను మార్చి వికీపీడియాలో పొందుపరచటానికి వీలు చేసింది. భారత దేశపు భాషలలో తెలుగులో అత్యధిక వ్యాసాలున్నాయి. ఎక్కువగా వాడే వెబ్ సైట్లలో ప్రపంచంలో 4 వ స్థానంలో, భారతదేశంలో 10 వ స్థానంలో వుంది. ప్రతి నెల 244 మిలియన్ల వేరు వేరు వ్యక్తులు దీనిని వాడుతున్నారు.

వికిపీడియా ఫౌండేషన్ కేవలం 22 మంది ఉద్యోగస్తులు కలిగివుంది. నిష్పాక్షికత, కలుపుగోలుతనం వికిపీడియాకు బలమైన లక్షణాలు.
వికియా
వికిపీడియా లో వున్న సమాచారం కన్నా, కొంతమందికే ఆసక్తి వున్నటువంటి వాటిపై ఎక్కువ సమాచారం వికియాలో చేరుస్తున్నారు. దీనికి మప్పెట్ వికియా ఉదాహరణ.

వికీ శోధన
అంతార్జాలంలో చాలా వరకు మూలాల గోప్యతలేని సాప్టువేరు వున్నా, శోధన గూగుల్, యాహూ, మైక్రోసాఫ్టు లాంటి సంస్థల చేతిలో చిక్కుకు పోయిందన్నారు. వికియా గోప్యతలేని శోధనా యంత్రాన్ని రూపు దిద్దుతున్నారు. దీనిలో ఫలితాలను, వాడుకరులు అభీష్టాల మేరకు నియమాల ఆధారిత విధానాల ద్వారా మారుతుంది. ఈ విధంగా శోధనా ఫలితాలు మరింత మెరుగవుతాయి.