అకాడమీ అంటే మీకేమనిపిస్తోంది? ఎదో ఒక రంగము అభివృద్ధికి కృషి చేసే సమూహాలు గర్తుకి వస్తున్నాయా లేదా? తెలుగు అకాడమీ, సంగీత నాటక అకాడమీ లాంటివి. అలాగే వికీపీడియా అకాడమీ, వికీ పీడియా అభివృద్ధికి కృషి చేస్తుంది. వికీపీడియాని చాలా మంది చదవడానికి మాత్రమే వాడుతున్నారు. దానిలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చని ఎంతమందికి తెలుసు. తెలిసినా ఎంతమంది చేస్తున్నారు.తెలుగు మరి ఇతర భారతీయ భాషలలో వ్యాసాలు తక్కువగా వుండటానికి చాలా అటంకాలు వున్నప్పటికి, వికీపీడియా గురించి, దానిలో సమాచారం ఎలా చేర్చవచ్చో తెలియక పోవడమే పెద్ద ఆటంకం. దానిని తొలగించటానికి ఉద్దేశించిందే వికీపీడియా అకాడమీ.
పనిచేసే విధానం.
వికీపీడియా అకాడమీ అంటే పెద్ద భవనాలున్న సంస్థ అనుకోకండి. కనీసం ఒక కంప్యూటరు, నెట్వర్క్ అనుసంధానసదుపాయం వున్న చోట, వికీపీడియా గురించి తెలియని వారికి, తెలియచెప్పటమే ఈ అకాడమీ పని. తెలుగు ఎలా టైపు చేయాలో, వికీపీడియాలో మార్పులు ఎలా చేయాలో చెప్పటము, వారితో చేయించటం. కొత్త వ్యాసాలు మొదలెట్టటము, లేక పాత వ్యాసాల నాణ్యత పెంచడము , ఎవైనా సందేహాలుంటే తీర్చడము లాంటి పనులు చేస్తే సరిపోతుంది. వీటికి కావలసిన సమాచారం అంతా తెలుగు వికీపీడియా నివాస పేజీలోని స్వాగతం విభాగంలో వుంది మరి. కాకపోతే దీనిని, ప్రజంటేషను శైలికి మార్చితే అందరికీ బాగా సౌలభ్యంగా వుంటుంది.
ఇంకెందుకు ఆలస్యం.
మీ దగ్గరిలో వున్న మీ మిత్రునికి చెప్పి వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.
మరింత తెలుసుకోండి.
చెన్నయిలో వికీపీడియా అకాడమీ గురించి వార్త
4 comments:
కావలసిన ప్రజంటేషన్లు తయారు చేసే పని మొదలయ్యింది.
వికీపీడియా పరిచయం
తెలుగు కీ బోర్డు
తెలుగు వికీలో పని చేయటం ఎలాగా
భళా! ఎప్పట్నుంచో నా మనసులో ఉన్న ఆలోచన. ముఖ్యంగా కళాశాలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళి వికీపీడియాను పరిచయం చేయాలని. కానీ ఎవరైనా తోడుంటే బావుండు అనుకుని ఆగిపోతున్నాను. వికీ అకాడమీ తో నా పని సులువు కాగలదని ఆశిస్తున్నాను.ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే నాకు కూడా తెలియజెయ్యండి. నాకు వీలైనంతలో సహాయపడగలను.
రవి చంద్ర గారు,
e-తెలుగు సహాయంతో హైద్రాబాదులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ సహాయం చాలా ఉపయోగంగా వుంటుంది.
ధన్యవాదాలు
అర్జున
తెలుగు కీ బోర్డు సరియైన లింకు
Post a Comment