Pages

Sunday, January 17, 2010

తెవికీ 2009 గణాంకాల విశ్లేషణ, 2010 లక్ష్యాల పై ఆలోచనలు


వికీపీడియా 9 వ జయంతి బెంగుళూరు సభ సందర్భంగా, నేను తెవికీ పై పత్రం (ఇంగ్లీషులో) సమర్పించాను. తెవికీలో తెవికీ 2009 గణాంకాల విశ్లేషణ చేశాను. ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే,
పేజి వీక్షణలు అత్యధిక స్థాయిలో డిసెంబరు 2009 లో 4.1 మిలియన్లు (అనగా 1.6 సెకండ్లకి ఒకటి) . ఇది డిసెంబరు 2008 తో పోల్చితే, 111 % పెరుగుదల. అన్ని వికిపీడియాల పెరుగుదల తోపోల్చితే తెవికీ 16 వ స్థానంలో వుంది. ఇది హైద్రాబాదు పుస్తక ప్రదర్శన లో ఇ-తెలుగు ప్రచారం ఫలితమేమో?
నాణ్యత పెరుగుతున్నప్పటికి, పెరుగుదల నేను అశించిన స్థాయిలో లేదు. 2010 కి మార్గదర్శకం చేయవలసిన బాధ్యత అనుభవజ్ఞులైన వికీపీడియన్లమీదవుంది.
నా సలహాలు

  • ప్రతి ఇంజనీరింగు/పెద్ద కాలేజీలో, తెవికీ అకాడమీ నిర్వహించడం.

  • ప్రధాన ప్రాజెక్టులు ఎంచుకొని, వాటికి మొదటి పుటనుండి లింకు ఇచ్చి, సహకారం పెంపొందించడం.

  • ప్రతి నెల/౩ నెలలకు ప్రగతి నివేదిక తయారు చేయడం

  • విద్యా శాఖ తో, చర్చించి మీడియా వికీ ప్రాజెక్టు ని పిల్లలకు పరిచయం చేసి, 8,9,10 స్కూలు పిల్లలు విద్యా శాఖ వారి,స్కూలు వికీలో ప్రాజెక్టులు చేయడం. మళయాళం వికీ వాళ్లు ఇలా చేస్తున్నారు

  • స్మార్ట్ ఫోనులలో తెలుగు వెబ్ సైట్ల ప్రదర్శనకు ఇబ్బందులను తోలగించటానికి కృషి చేయడం.


మరి మీరేమంటారు?

గమనిక:ఫోటో ఓంశివప్రకాష్ సౌజన్యంతో

3 comments:

Vasu said...

మీ తెలుగు వికి కృషికి జోహార్లు.

"పేజి వీక్షణలు అత్యధిక స్థాయిలో డిసెంబరు 2009 లో 4.1 మిలియన్లు (అనగా 1.6 సెకండ్లకి ఒకటి) . ఇది డిసెంబరు 2008 తో పోల్చితే, 111 % పెరుగుదల."

సంతోషం

కొత్త పాళీ said...

చాలా బావుందండీ. తెవికీ పట్ల ఇలా అంకిత భావంతో పనిచేస్తున్న ఒక బృందం ఉండడం అభినందనీయం.

తెవికీ విషయం ఇంకా జనులకి తెలియడం లేదు. విద్యావంతులు, నెట్ ఉపయోగించేవాళ్ళు చాలా మందికే ఇంకా దీన్నొ గురించి తెలియదు.

సమాచారపు పేజీలు తయారు చెయ్యడం, వాడకం వృద్ధి చెయ్యడం - ఈ రెండూ సమాన స్థాయిలో జరగాలని నా ఉద్దేశం.

Arjun said...

వాసు, కొత్త పాళీ గారి స్పందనలకు ధన్యవాదాలు.
మీరు వుండే చోట, తెవికీ సభ్యులతో కలిసి తెవికీ ప్రచారం చేయమని మనవి.
కర పత్రాలకి సహాయం చేయగలను.

అర్జున.