Pages

Sunday, May 16, 2010

ఇన్ స్క్రిప్ట్ ప్రయోగం ముగిసింది

"ఇండికీస్ ; ఇన్ స్క్రిప్ట్ తెలుగు అక్షర మీటకాల అతుకులు" ప్రయోగం ముగిసింది
ముగింపు బొమ్మలు చూడండి.
వాడిన తరువాత

అలవాటయిందని, అతుకులు తొలగించాక

మిగిలి పోయిన జిడ్డు తొలగించుతూ. (పూర్తిగా తొలగలేదు)

అనుభవం: టచ్ టైపింగ్ అలవాటవలేదు.ఉచ్ఛారణ సారూప్యమున్న ఇంగ్లీషు అక్షర మీటకి, తెలుగు అక్షరపు మీటకి గందరగోళం తగ్గటానికి చాలా అనుభవం కావాలి. ఇప్పటికి స్పీడు రాలేదు. 404 పదాలు, 2484 అక్షరాలు, టైపింగు వేగం 5932 బైట్లుకి ( utf-8) చేరుకుంది. (Gedit లో అరగంట టైపు చేసినగణాంకాల్ని రెట్టింపు చేశాను) ఇది పోతన తో వున్న వేగానికి (చాలాకాలం కిందటి) 18శాతం తక్కువ.

నిర్ణయం/సలహాలు
స్టికర్ల ఉపయోగం బాగానే వుంది. అయుతే నల్లగా మారకుండా వుంటానికి, వీటిపై పారదర్శక టేపు అంటించుకుంటే మంచిది. అయితే,
రానున్న స్మార్ట్ ఫోన్లను దృష్టిలో పెట్టుకుంటే, (వాటికి పూర్తి స్థాయి కీ బోర్డు వుండదు కాబట్టి), లిప్యంతరీకరణ కీ బోర్డులు,(పోతన లేక గూగుల్ లేక మైక్రోసాఫ్ట్ లాంటివి) వాడటం మంచిది. ఇన్ స్క్రిప్ట్ కూడా స్మార్ట్ ఫోన్లకు అనుగుణంగా చేయటం మంచిది. దీని గురించి త్వరలో ఇంకొక పోస్టు. ఇప్పటికి లిప్యంతరీకరణ కీ బోర్డులు వాడేవారు, ఇన్స్క్రిప్ట్ వైపు మారనక్కరలేదు.

9 comments:

శశికాంత్ said...

నేను స్టికర్లు అతికించకుండానే బాగా నేర్చుకున్నాను..
కొద్దిగా ఓపిక మరియు కుతూహలంతో కేవలం వారం రోజుల్లో సంతృప్తికర వేగంతో టైపు చేయగలుగుతున్నాను.
మధ్యలో నెల రోజుల పాటు వాడకపోయినా ఇప్పటికీ నాకు అన్నీ బాగా గుర్తున్నాయి.
మొదట్లో onscreen keyboard చూస్తూ సాధన చేశాను , తర్వాత అలవాటైపోయింది.

Arjun said...

అనుభవం తాజాస్థితి: టైపింగు వేగం గంటకి 341 పదాలు, 2484 అక్షరాలు, 7785 బైట్లుకి ( utf-8) చేరుకుంది. (Gedit పరికరంలో గణాంకాలను బట్టి)

Krishna Karthik said...

నా వరకు అయితే మొదట ఇన్స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడింది. కేవలం 2 రోజుల్లోనే చాలా speed వచ్చింది.
కానీ కొన్ని సమస్యలు వచ్చాయి
1. యి అనే అక్షరం ఎలా రాయాలో తెలుసుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఆ తరువాత య కు గుడి ఇస్తే యి వస్తుందన్న విషయం తెలుసుకున్నాను.(ఎంతైనా B.Sc చదువుతున్నాను కదా ఒకటో class లో చదివినియ్యి ఎం గుర్తు వుంటాయి )
2. ఇంకో సమస్య ఎదురైంది. ఫైర్ఫాక్స్ అనే వస్తుంది కానీ ఫైర్‌ఫాక్స్ అని రావడం లేదు ఈ సమస్య నాకు చాలా రోజులు వేదించినది. పై లాగానే ఈ సమస్య కు ఎన్ని రోజులయినా పరిష్కారం దొరకలేదు. నాకు పెర్ఫెక్ట్ గా నేర్చుకోకపోతే తిక్కరేగి పూర్తిగా వొదిలేసినా వోదిలేస్తా. ఆ విధంగానే కస్టపడి నేర్చుకొన్న inscript ను వాడడం వోదిలేసాను. అయితే వాటి పదులు లేఖిని,try చేశాను.ప్రతిసారి కాపీ పేస్టు చేయడం నాకు నచ్చలేదు. బరహ,అక్షరమాల,లాంటివి కూడా try చేశాను ఎందుకో నాకు అవన్ని అంతగా నచ్చలేదు ప్రముక కీ పాడ్ ను మాత్రం చాలా రోజులు వాడాను. ఎందుకంటే నేను ఏం టైపు చేసినా ఒక అక్షరం టైపు చేసినా అది తెలుగు లోనే చూపిస్తుంది.కాబట్టే అది వాడాను. ఆ తరువాత గూగుల్ input method ను తెలుసుకుని దానిని ఒక సరి ట్రై చేశాను. చలా బాగుంది. ఆ తరువాత దానినే వాడుతూ వొచ్చాను. అయితే inscript కు zero width joiner వుండవచ్చు, అనే సదుదేస్యంతో net లో చూస్తూ వుండేవాడిని.చాలా చోట్ల దీనికి పరిష్కారం ఇవ్వకపోగా దానిని జీరోవిడ్త్ లేకుండానే వాడమనే సలహాలు చూసాను. ఇక ఇది వుండదనే బావించి తెలుగు వికి లో ఇన్స్క్రిప్ట్ వ్యాసంలో ఈ లోపాన్ని రాసాను. అక్కడ నేను రాసిన వ్యాక్యం డిలీట్ చేయడం నాకు కోపాన్ని తెప్పించింది. నేను వివరణ కోరగా దీనిలో ఈ లోపం లేదని ctrl+shift+2 బటన్లు నొక్కితే zero width వస్తుందని వ్యాక్యాన్ని చేర్చారు. నేను మల్లీ సందేహంలో పడ్డాను. దేనిని వాడలో అర్ధం కాలేదు.
3. ఇంతలోనే నాకు ఆపిల్ keyboard గురించి తెలిసింది. బయట ఎవరు వాడినా DTP రంగంలో రారాజు ఆపిల్ అనే తెలిసింది.కానీ ఇంటర్నెట్లో అది కుదరదు.సరే inscript నే DTP లో వాడదాం అంటే pagemaker, photoshop లో unicode support లేదు. పైగా ఆపిల్ నేర్చుకొంటే అది resume లో extra qualification తప్పక అవుతుంది. రెండు నేర్చుకోవడం కంటే ఒక దాన్నే standard చేసుకోవడం మంచిది.పోనీ వీవెన్ తాయారు చేసిన ఆపిల్ ను వాడదాం అంటే anu script manager దానికి, వీవెన్ దానికి కొన్ని తేడాలు వున్నాయి. మళ్ళీ కధ మొదటికి వచ్చింది.
4.ఇంతలోనే ubumtu కొత్త virsion 10.04 వచ్చింది. నేను అప్పటికి 9.04 వాడుతున్నాను. అందులో వున్నా చాలా లాభాల్లో language bar కూడా ఒకటి. అందులో అన్ని భాషల్లో keyboard layouts వున్నాయి. మన తెలుగులో అయితే 5 రకాల keyboard layouts వున్నాయి.apple,inscript, potana, rts,ఇవ్వన్ని వున్నాయి. linux తో అయితే నా system వేగంగా run అవుతుంది.అందుకే నెట్ ను linux లో నే వాడతాను. ఇప్పుడు నాకు సరైన solution దొరికింది. anu fonts ద్వారా xpలో ఆపిల్ వాడతాను.అదే ఆపిల్ తో linuxలో నెట్ వాడతాను. అయితే xpలో వున్నప్పుడు నెట్ వాడవలసి వస్తే గూగుల్ input method ను use చేస్తున్నాను.already apple keyboard మాత్రమే వచ్చిన వారికీ ఇది శుభవార్తే.
చివరగా నేను చెప్పేదేమిటంటే తెలుగు వారికీ ఒక standard అనేది లేదు.లేఖిని లో టైపు చేస్తే వచ్చే పదాలకి prmuka type pad లో టైపు చేస్తే వచ్చే పదాలకి తేడా వుంటుంది.అలాగే విండోస్ లో వుండే ఇన్స్క్రిప్ట్ కి లినక్సు లో వుండే ఇన్స్క్రిప్ట్ కి తేడాలున్నాయి. ఎవరికీ ఇష్టమొచ్చిన key combination ని వారు వాడుకుంటున్నారు. బయట వుద్యోగం దొరకాలంటే apple keyboard వచ్చా? అని అడుగు తారు.నెట్ లో తెలుగు వారు ఇన్స్క్రప్ట్ కి ప్రచారం చేయడం నాకు హాస్యాస్పదంగా వుంది.microsoft language creation ద్వారా వీవెన్ గారు ఆపిల్ ను డెవలప్ చేయడం స్టాండర్డ్స్ కి మొదటి మెట్టు. నిజానికి inscript లో లోపాలు చాలా స్పష్టంగా కనపడతాయి.
1. రివర్సులో టైపు చేయడం-
మనం పుస్తకంలో రాసే తెలుగు భాషకు ఇక్కడ రివర్సులో టైపు చేయాలి. (మార్గాలు అని రాయాలంటే మా తరువాత
"ర + గ వత్తు +దీర్గం") మమూలుగా అయితే
"ర + దీర్గం+ గ వత్తు" అంటే ముందు ఈ రివర్సు కు అలవాటు పడాలి.(వీవెన్ గారి ఆపిల్ లో కూడా ఇదే ఇబ్బంది.)
2. alt+shift ఎప్పుడు english నుంచి telugu కు మారలన్నా ఈ keys నొక్కడం చాలా ఇబ్బంది. linux లో ctrl+space ఇచ్చి ఈ ఇబ్బంది కుంచెం తగ్గించారు.(అయితే ఇది విండోస్ లో వున్న problam)

ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కేవలం తెలుగు అని కాకుండా అన్ని భారతీయ భాషలకూ ఒకే keyboard layout వుండాలని ఇన్స్క్రిప్ట్ తాయారు చేసారు. ఆ తరువాత దానికి ఒక్క updation కూడా లేదు. వీటి కంటే ఆపిల్ ని unicode కి తగ్గట్టు ఎవరైనా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని,నా అబిప్రాయం.

Arjun said...

కార్తీక్ గారు,
మీ సవివరమైన ఉపయోగపడే వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఇన్ స్క్రిప్ట్ కొత్త ప్రామాణికం కాబోతున్నది. వివరాలు చూడండి. టైపు చేసే పద్ధతి సంయుక్తాక్షరాలున్నప్పుడు అచ్చుతో అంతం కావడమే యూనికోడ్ ప్రామాణికమనుకుంటాను. కాకపోతే మన చేతి రాతలో అచ్చు ముందల రాయటం సులభంగా వుంటుంది. మీరు విండోస్, ఉబుంటులో వాడుతున్నారు కాబట్టి, తేడాల పట్టీ తయారుచేస్తే ముందు వచ్చే వాటిలో సరిచేయటం వీలవుతుంది.

Krishna Karthik said...

"టైపు చేసే పద్ధతి సంయుక్తాక్షరాలున్నప్పుడు అచ్చుతో అంతం కావడమే యూనికోడ్ ప్రామాణికమనుకుంటాను"
ఎందుకో నాకు ఇది correct కాదనిపిస్తుంది.linux లో వుండే apple keyboard ఇలా వుండదు. అయితే zero width కు ఏం కీ వాడాలో తెలియట్లేదు. మీకు తెలిస్తే చెప్ప గలరు.

Arjun said...

మీరు యూనికోడ ప్రామాణికాన్ని 9 వ ఖండంలో ఎన్కోడింగ్ సిద్దాంతాలు చూస్తే తెలుస్తుంది. కొంత భాగాన్ని ఇక్కడ రాశాను.
Encoding Principles. The writing systems that employ Devanagari and other Indic scripts
constitute abugidas—a cross between syllabic writing systems and alphabetic writing systems.
The effective unit of these writing systems is the orthographic syllable, consisting of a
consonant and vowel (CV) core and, optionally, one or more preceding consonants, with a
canonical structure of (((C)C)C)V. The orthographic syllable need not correspond
exactly with a phonological syllable, especially when a consonant cluster is involved, but
the writing system is built on phonological principles and tends to correspond quite closely
to pronunciation.

ఇక ఏపిల్ కీ బోర్డులు, ఇతర టైపురైటరు కీ బోర్డుల లాగా రూపవరుస, లేక చేతి రాత వరుస ఆధారంగా చేయబడి వుండవచ్చు. అందుకని గుణింతాలు ముందల రాసి తరువాత వత్తులు రాయటం వ్యాప్తిలో వుండవచ్చు. అప్పుడు Zero width కోడ్ లు అవసరంలేదు. ఆ ఫైల్ లో అవసరమనుకుంటే ప్రవేశ పెట్టవచ్చు. అయితే లినక్సులో మార్పులు చేయ టానికి, విండోస్ లో ఎలా చేస్తారో తెలియాలి. ఎందుకంటే ప్రామాణిక అధారాలు నాకు కనబడలేదు.

Krishna Karthik said...

ఏదో ఒక్క కీబోర్డు మాత్రమే standard గా వుండాలనేది నా అభిప్రాయము. standard అవ్వాలంటే తెలుగులో 2,3 కీబోర్డ్ లు తెలుసుకొని వుండవలసిన పరిస్ధితి రాకూడదు. web కోసం inscript నేర్చుకోవడం, page maker లో unicode support వుండదు కాబట్టి, దాని కోసం apple ని నేర్చుకోవడం కొంత సమస్యే. indesign లో unicode support వున్నా తెలుగు నీటుగా రాదు. anu graphics లో inscript లేదు. doe వున్నా కొన్ని తేడాలు వున్నాయి.DTP లాంటి అవసరాలకి మూడో,నాలుగో వున్న unicode font లు దేనికీ పనికిరావు. ----------
--------- నేను సెలవుల్లో ఖాళీగా వున్నప్పుడు,dtp లో పని చేసాను. అప్పటికి inscript మాత్రమే నాకు వచ్చు. కానీ అది నాకు దేనికీ పనికిరాలేదు. మళ్లీ ఇప్పుడు,apple మెదటి stage లో వున్నాను. ఇలాంటి ఇబ్బంది ఎవరికి వుండకూడదనేదే నా అభిమతం.

కషాయం said...

తెలుగులో టైప్ చేస్తున్నప్పడు మయన్.క్ అని రాయడానికి చుక్క పెట్టి రాయవలసి వస్తున్నది. చుక్క తీసేస్తే మయన్క్ అయిపోతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి.

Arjun said...

ZWJ వాడితే సరిపోతుంది. అయితే మీరు వాడే కీబోర్డ్ రకాన్ని బట్టి నొక్కవలసిన మీట మారుతుంది. ఉదాహరణకు వికీపీడియాలో లిప్యంతరీకరణ పద్దతి సమాచారము చూడండి. ఇన్స్క్పిప్ట్ గురించి సమాచారము చూడండి.