Pages

Sunday, August 31, 2008

తెలుగు లిపి రూపం- లినక్సు విండోస్ కష్టాలు

ఫైర్‌ఫాక్సు 3.0.2 తెలుగు పాక్ తయారుచేసి చూస్తే విండోస్ కి లినక్సుకి పరభాషా పదాలు తెలుగు లో చూపించడంలో తేడాలు కన్పడ్డాయి. అవి ముఖ్యంగా ఒక హల్లు తరువాత ఇంకొక హల్లు చేర్చి అచ్చు లోపించినప్పుడు విండోస్ ఒక విధంగా లినక్సు వేరొక విధంగా రూపుదిద్దుతాయి.
ఉదాహరణకి
fox అనే ఇంగ్లీషు పదాన్ని లిప్యాంతరీకరించినప్పుడు టైపు చేసే విధానము (అర్ధమవటంకోసం అక్షరలమధ్య ఖాళీ ఇవ్వటం జరిగింది) , చూపించే విధానము పరిశీలించండి




టైపు విండోస్ లినక్సు
ఫా క్ స్ zwj ఫాక్స్‍ (సరికాదు) ఫాక్స్‍ (సరి)
ఫా క్ స్ ఫాక్స్ (సరి)ఫాక్స్ (సరికాదు)

ఇలా ఎందుకని జరుగుతందని ఆరా తీస్తే
విండోస్ యూనిస్క్రైబ్ zwj అవసరం లేకుండా రూపు దిద్దితే లినక్సు కి zwj అవసరం కావాలి
ఇంతకీ zwj మొదలు భారతీయ భాషలకు ఉపయోగించలేదు. inscript లో లేదు.
ప్రస్తుతానికి fox లాంటి పదాలకు విండోస్, లినక్సు లో ఒకే విధంగా, ఎబ్బెట్టు లేకుండా కనపడాలంటే ఫాక్సు అని పదంచివరలో అచ్చులోపించకుండా రాసుకోవడమే?

3 comments:

వీవెన్ said...

నేను ఇది లోహిత్ ఖతి (ఫాంటు) లో సమస్యేమో అని అనుకుంటున్నాను.

ఆ ఫాంటు వాడితే విండోసులో కూడా హలంతం (్) తో అంతమయ్యే సంయుక్తాక్షరాలు హలంతం విడిపోయి కనిపిస్తున్నాయి.

Arjun said...

విండోస్ లో గౌతమి వాడితే మీ కంప్యూటర్లో ఎలావుంది?
ఇంకొక విషయం. zwj వాడితే, క పూర్తి రూపు వచ్చి దాని నెత్తిమీద నకారం ్ అలాగే దాని పక్కన స మరియు నకారం వస్తున్నాయి.
లినక్సులో విండోస్ లాగా రూపు దిద్దటమే దీనికి పరిష్కారము. దానికి సంభందించి ఒక బగ్ నమోదు చేశాను. http://bugzilla.gnome.org/show_bug.cgi?id=516947

Arjun said...

ఇది లోహిత్ తెలుగు ఫాంటు లో బగ్ అని తెలిసింది. పోతన2000 ఫాంటు వాడితే సరిగా చూపింది.
మరిన్ని వివరాలకు
http://bugzilla.gnome.org/show_bug.cgi?id=516947#c2