Wednesday, December 24, 2008
లోపాలు లేకుండా లినక్స్ లో తెలుగు అక్షరరూపము
ఇప్పటి వరకు నేను చూసిన తెలుగు అక్షరరూపాల లోపాలకు విరుగుడు కనగొనటంలో సఫలమైయ్యాను. అవేంటంటే
హల్లుతో అంతమయ్యే పరభాషా పద భాగాలలో హలాంతం విడిగారావటం
దీనికి లోహిత్ ఫాంటులో దోషం కారణం. పోతన2000 ఫాంటుతో సరి అవుతుంది.
ఋత్వము వేరే వత్తు తర్వాత వస్తే, ముందు ఋత్వం వచ్చి తరువాత వత్తు రావడం. దీనికి విరుగుడు పాంగోలో కోడు సరిచేసిపెట్టాను.
ఇది కొన్నాళ్లలో విడుదలవుతుంది.
Labels:
font problems,
linux,
lohit,
pango,
telugu,
తెలుగు లినక్స్,
ఫాంటు దోషం
11 comments:
కూల్.
కొత్త పాంగో కోసం వేచిచూస్తాను.
ధన్యవాదాలు,
మీరు బగ్ పేజీలో ఒక వ్యాఖ్య రాసి సహకరిస్తే పొంగో త్వరలో కొత్త్త విడుదల రావటానికి సహాయంగా వుంటుంది.
oh great!
అర్జున్ గారికి అభినందనలు!హలంతం విషయంలో లోహిత్ ఫాంటు తీసేసి పోతన2000 ఫాంటు ఎలా సెట్ చేసుకోవాలో దయచేసి తెలుపగలరు. నేను లినక్స్ కి బాగా కొత్త...!నేను ఉబుంటూ 8.10 వాడుతున్నాను(నేర్చుకుంటున్నాను). దయచేసి...అర్జునా, ఫల్గుణా, పార్థా....!
ఉబుంటు 8.10 లో ఈ విధంగా చేసి పోతన ఫాంటునే వాడేలా చేయవచ్చు.
ఈ క్రింది కమాండులను టెర్మినల్ లో టైపు చెయ్యండి.
$cd
$sudo mv /usr/share/fonts/truetype/ttf-telugu-fonts/lohit_te.ttf .
మీ పాస్వర్డ్ అడిగినపుడు టైపు చెయ్యండి.
లోహిత్ ఫైలుని మీ నివాస సంచయంలో పెట్టారనమాట.
మీ కంప్యూటరుని పునఃఫ్రారంభించండి.
అంతే, ఇక మీరు పోతన ఫాంటులో తెలుగు చూస్తారు. ఇక వేళ లోహిత్ కావలసి వస్తే, మరల ఆ ఫైలుని యధాస్థానంలో పెట్టి పునఃఫ్రారంభించండి.
పునఃప్రారంభించనవసరంలేకుండా
$fc-cache
కమాందు ఇచ్చి
తరువాత, మీరు వాడుతున్న అనువర్తనం (ఫైరఫాక్స్ లాంటివి) ఒకసారి మూసి,మరల తెరిస్తే సరిపోతుంది.
ఇంకొక్క సంగతి. ఫైర్ఫాక్స్ లో Edit-> Preferences-> Fonts & Color-> Advanced విండోలో
Fonts for telugu లో serif, san-serif monospace కి పోతన పాంటుని ఎంచుకోని OK చేయండి.
ధన్యవాదాలు అర్జున్ గారు! మీరు చెప్పినట్లు చేసాను.బ్రహ్మాండంగా పని చేసింది.ఓపికగా,వివరంగా తెలియచెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు.
లోహిత్ ఖతిలో హల్లులతో సంయుక్తాక్షరాలు వచ్చి హలాంతంతో అంతమయ్యేటప్పుడు హలాంతం వేరుగా రావటం అనే దోషం 2.3.8 విడుదలతో సవరించబడింది. వెంటనే కావాలనుకుంటే భలేరావు సైటు నుండి తెచ్చుకొని దానిలోని lohit_te.ttf స్థాపించుకొని ప్రయత్నించండి. లేక ఇంకొన్నాళ్లు వేచి మీ లినక్స్ విడుదలని నవీకరణ చేస్తే సరిపోతుంది.
పోతన ఫాంటుతో బొద్దు అక్షరాలు సరిగా రూపు దిద్దకపోవడం,( ఇది కృష్ణ దేశికాచారి గారికి వ్యక్తిగతంగా తెలియచేసాను.),
కొన్ని ఇంగ్లీషు పేజీలు తెలుగు, ఇంగ్లీషుతో రూపు దిద్దే దోషాలున్నాయి కాబట్టి, ప్రస్తుతానికి లినక్స్ లో లోహిత్ తెలుగుకి సరియైన ఖతి.
2008 దాటిపోయి 2010 వచ్చినా లినక్స్ హలంతాల సమస్య ఇంకా తీరినట్లు అనిపించటం లేదు. మీ బ్లాగు టైటిల్లో కూడా ఈ దోషం ఉన్నదున్నట్లే కనబడుతున్నది..కనీసం నేను వాడుతున్న ఉబుంటు 9.04 యంత్రంలో. (అప్పట్లో నేను లోహిత్ ఖతిని abhinay's blog లింకు నుండి తెచ్చుకున్నాను..బహుశ: దోషం అక్కడుందేమో..?) మీరు చెప్పిన భలేరావు సైటు తెరుచుకోవటంలేదు. 'సరిచేయబడిన లోహిత్ ఖతి' ఇంకా ఎక్కడుంటుందో చెప్పగలరు.
నారాయణ గారు,
మెరుగైన లోహిత్ తెలుగు ఈ తెలుగు ఖతుల ఉబుంటు పేకేజి లో వుంది. దీనిని మీ సిస్టమ్ లో వాడి చూడండి.
Post a Comment