Showing posts with label lohit. Show all posts
Showing posts with label lohit. Show all posts
Sunday, April 12, 2009
తెలుగు అక్షర రూప సమస్య (కా+ష్= క్షా)
లినక్స్ లో తెలుగు అక్షర రూప సమస్యలు నిర్మూలన ఐనవనుకుంటుంటే, ఇటీవలే ఇంకొకటి కనబడింది. వికీపీడియా చదువుతూ లోక్ సత్తా గురించిన పేజీకి వెళితే, అక్కడ జయప్రక్షా అని కనపడింది. పొరపాటుగా తప్పు చేయబడిందని సరిచేయపోతే, ఈ సమస్య వెలుగులోకివచ్చింది. క్ ష ని మాత్రమే కలిపిచూపించవలసిన కోడ్ కా వచ్చిన తరువాత కూడా ష వస్తే కలుపుతున్నది. ఇది ఫాంటులో దోషమా లేక రూపుదిద్దు అనువర్తనములో (pango) లో సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నించాను. పోతన 2000 ఖతితో కూడా ఈ సమస్య కనబడటంతో, బహుశా, పాంగోలో దోషం వుండివుంటుంది.
Labels:
font problems,
linux,
lohit,
pango,
telugu,
తెలుగు లినక్స్,
ఫాంటు దోషం
Wednesday, December 24, 2008
లోపాలు లేకుండా లినక్స్ లో తెలుగు అక్షరరూపము

ఇప్పటి వరకు నేను చూసిన తెలుగు అక్షరరూపాల లోపాలకు విరుగుడు కనగొనటంలో సఫలమైయ్యాను. అవేంటంటే
హల్లుతో అంతమయ్యే పరభాషా పద భాగాలలో హలాంతం విడిగారావటం
దీనికి లోహిత్ ఫాంటులో దోషం కారణం. పోతన2000 ఫాంటుతో సరి అవుతుంది.

ఋత్వము వేరే వత్తు తర్వాత వస్తే, ముందు ఋత్వం వచ్చి తరువాత వత్తు రావడం. దీనికి విరుగుడు పాంగోలో కోడు సరిచేసిపెట్టాను.
ఇది కొన్నాళ్లలో విడుదలవుతుంది.
Labels:
font problems,
linux,
lohit,
pango,
telugu,
తెలుగు లినక్స్,
ఫాంటు దోషం
