Pages

Sunday, April 12, 2009

తెలుగు అక్షర రూప సమస్య (కా+ష్= క్షా)

లినక్స్ లో తెలుగు అక్షర రూప సమస్యలు నిర్మూలన ఐనవనుకుంటుంటే, ఇటీవలే ఇంకొకటి కనబడింది. వికీపీడియా చదువుతూ లోక్ సత్తా గురించిన పేజీకి వెళితే, అక్కడ జయప్రక్షా అని కనపడింది. పొరపాటుగా తప్పు చేయబడిందని సరిచేయపోతే, ఈ సమస్య వెలుగులోకివచ్చింది. క్ ష ని మాత్రమే కలిపిచూపించవలసిన కోడ్ కా వచ్చిన తరువాత కూడా ష వస్తే కలుపుతున్నది. ఇది ఫాంటులో దోషమా లేక రూపుదిద్దు అనువర్తనములో (pango) లో సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నించాను. పోతన 2000 ఖతితో కూడా ఈ సమస్య కనబడటంతో, బహుశా, పాంగోలో దోషం వుండివుంటుంది.

11 comments:

Anonymous said...

ఇప్పటివరకూ ఇది లోహిత్ ఖతిలో మాత్రమే సమస్య అనుకున్నాను. పోతనతో బాటుగా సీ-డాక్ జిస్ట్ వారి ఖతులలో కూడా ఈ సమస్య ఉంది. కానీ e-Telugu ఖతిలో మాత్రం లేదు. ఉదాహరణ తెరపట్టు.

విండోస్‌లో కూడా చూసి అప్పుడు పాంగోలో సమస్య అని నిర్ధారించవచ్చు.

Arjun said...

ధన్యవాదాలు వీవెన్,
e-Telugu ఖతిలో సమస్య లేదంటే, ఇది పాంగో సమస్య కాదేమో.
e-Telugu ఖతి పరిపూర్ణమైనదేనా, దానితో ఇంకేమైనా సమస్యలున్నాయా. (ఉదాహరణకి, పోతనతో బొద్దు అక్షరాల సమస్య వుంది).

Anonymous said...

e-Telugu ఖతి కూడా కేవలం రెగ్యులర్ అక్షరాలతోనే ఉంది. సీడాక్ వాళ్ళు చేసిన ఖతుల్లో మాత్రం బొద్దు, వాలు అక్షరాలను కూడా చేర్చారు.

Arjun said...

ఫెడోరాలో బగ్ 494902 చేర్చాను

Arjun said...

పాంగో బగ్ 579398 చేర్చాను.

Arjun said...

ఇది పాంగో బగ్ అని తెలిసింది.
ఎందుకంటె మళయాళం లో కూడా ఈ సమస్య వుందని తెలిసింది. వివరాలకు పాంగో బగ్ లోని లింకు చూడండి

Arjun said...

KDE ఉపయోగించేటప్పుడు ఈ సమస్య లేదు. కుబుంటు 8.10 తో పరీక్షించాను. కెడిఇ లో పాంగోని భాష విశ్లేషణకి వాడకుండా, అక్షర రూపుకి మాత్రమే వాడతారు.

Arjun said...

ఓపెన్ ఆఫీస్ 2.4 లో సమస్య లేదు తెర పట్టు చూడండి. ఈ సమస్యకు మూలం, పరిష్కారం దారి

Arjun said...

చివరికి పరిష్కారం కనుగొన్నాను. వివరాలకు పాంగో బగ్ చూడండి.లోహిత్ తెలుగు ఖతితో ఇక లినక్స్-జినోమ్ మరి ఇతర పరికరాలు చక్కగా వాడుకోవచ్చు.

Arjun said...

కొత్త హార్ఫ్ బజ్ తో కూడిన పాంగో విడుదలతో (1.31.0 27 ఆగష్టు 2012న) ఈ సమస్యకి అధికారిక పరిష్కారం విడుదలైంది. అయితే ఇంకా లినక్స్ పంపిణీలకు సరిపోయే విడుదలకి ఇంకా కొన్ని నెలలు పట్టవచ్చు.

Arjun said...

ఉబుంటు 12.04 వాడేవారికొరకు పాచ్