Pages

Friday, January 30, 2009

లినక్స్ తెలుగు వాడుకరుల కొక క్రొత్త గూగుల్ గ్రూపు linux-telugu-users


లినక్స్ తెలుగులో వాడేవారు చాలా తక్కువ అని గత రెండు సంవత్సారాలుగా తెలుగు కంప్యూటర్ రంగాన్ని గమనిస్తున్న నాకు తెలిసింది. తెలుగుబ్లాగులో ఉన్న దాదాపు 1850 మందిలో ఏ పదిమంది లినక్స్ వాడుతున్నారనుకుంటాను. భారతదేశంలో తెలుగు కంప్యూటర్లో వాడకం భవిష్యత్తులో పెరగడానికి, ఏ మాత్రం ఖర్చులేని, కాపీరైటు హక్కులు ఉల్లంఘన అవసరంలేని లినక్స్ సరి అని నేను భావిస్తాను. దీనికి తోడ్పడటానికి ఒక మెయిలింగు లిస్టు అవసరమనిపించింది. ఇప్పటివరకే ప్రాచుర్యంలో కల లిస్టులు అనగా indlinux-telugu ముఖ్యంగా అభివృధ్దికారులకొరకు ఉపయోగించబడుతున్నాయి. వాడుకరులకు ప్రత్యేకించి లిస్టులు లేవు. అందుకని ఒక క్రొత్త గ్రూపు తయారు చేశాను. linux-telugu-users
దీనిలో సభ్యులుగా చేరమని, ప్రస్తుత లినక్స్ వాడుకరులకు, ఆసక్తికలవారికి ఇదే నా ఆహ్వానం.

2 comments:

సూర్యుడు said...

మీ ఉద్దేశ్యంలో తెలుగు లీనక్స్ అంటే ఏమిటి? లీనక్స్ సిస్టం నుండి ఇప్పుడు నాలా తెలుగు వ్రాయడమా లేక ఇంకేమన్నానా?

Arjun said...

మీరనుకున్నది నేననుకున్నది ఒకటే, కాకపోతే ఇంకొంచెముముందుకి వెళ్లి, రంగస్థలం (desktop) లో చాలా వరకు తెలుగులో వాడితే, ముందు ముందు తెలుగు భాషామాధ్యమము గలవారందరు, పాఠశాల పిల్లలతో సహా వాడటానికి కుదురుతుంది. దానికి అవసరమైన ముఖ్య స్థానికీకరణ పనులు ఇబ్బందులు తెలుసుకోవటం, వాటిని సరిదిద్దే సలహాలు అందచేయటం కూడా ఈ లిస్టు యొక్క ముఖ్య ఉద్దేశం.