Pages

Sunday, September 27, 2009

ఇండికీస్ ; ఇన్ స్క్రిప్ట్ తెలుగు అక్షర మీటకాల అతుకులు


చాలాకాలం క్రిందట ఇన్ స్క్రిప్ట్ తెలుగు వాడటానికి ప్రయత్నించి అన్ని అక్షరాలను సులభంగా గుర్తుపెట్టుకొనలేక పోతన కీ బోర్డు వాడటం మొదలెట్టాసు.
ఇన్ స్క్రిప్ట్ తెలుగులో ఒక్క క అక్షరము తప్ప ఏది ఇంగ్లీషు అక్షరా ఉచ్చారణకి దగ్గర లేదు. పోతనలో నాలుగైదు అక్షరాలు మినహా అన్నీ దగ్గరగా వుంటాయి.

ఇప్పుడు తెలుగు వికీపీడియా వ్యాప్తికి, అన్ని కంప్యూటర్లలో వాడగలది, భారత ప్రభుత్వంచే ప్రామాణికమైసదైనటువంటిది అయిన ఇన్ స్క్రిప్ట్ ని వాడటానికి ప్రయత్నించాను.
దానికోసం తెలుగు అక్షర మీటకాల అతుకులు తయారు చేశాను.
ఒక వైపు గమ్ము పూసిన పేపరు పై ముద్రించి ముక్కలుగా కత్తిరించితే మా అమ్మాయి చకాచకా వాటిని అంటించింది. ఇక తెలుగు కీ బోర్డు తయ్యార్.
అది వాడి ఈ బ్లాగాంశం రాశాను. పోతనకి అలవాటుబడిన చేతులు మొరాయిస్తుంటే ఇది రాయటానికి ౪౦ (40) నిముషాలు పట్టింది. అంటే 101 పదాలతో 777 అక్షరాలు రాయగా వేగం గంటకి ౦.౩కిలోబైట్లు.
తెలుగు అక్షర మీటకాల అతుకులు ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. త్వరలో మరంత మెరుగుపరిచి అందరికి అందచేయాలని ప్రయత్నిస్తున్నాను.

11 comments:

mv said...

ఈ ప్రయత్నం చాలా బాగుంది .
ఇలా ఎవరైనా సులుభంగా తయారు చేసుకోవచ్చు కదా
ఖరీదైన కీబోర్డులు , స్టిక్కరులు ఎందుకు చెప్మా !!

వీవెన్ said...

:) మనసుంటే మార్గముంది అని గుర్తు చేసారు.

Arjun said...

ఒక 4 వారాంతాలు (రోజుకి సుమారు రెండు గంటలు) అనగా 8 గంటలు వాడిన తరువాత, గంటకు 2కిబై లేక నిముషానికి 4 పదాలు (గంటకి 249 పదాలు) తెవికీ వ్యాసం రాస్తూ (చాలా వరకు తప్పులు లేకుండా) చేయగలిగాను. అనుపమా ట్యూటర్ వారి వెబ్ స్థలం ప్రకారం నేర్పరి టైపిస్టు నిముషానికి 40 నుండి 60 పదాలు చేస్తారట. కనీసం 10 రెట్లు పెరగాలి.

ఈ అతుకులు వాడటం వలన కీ బోర్డు వైపు కంటితో చూసి టైపు చేయటం అలవాటవుతున్నది. దానితో చాలా నెమ్మదిగానే పని జరుగుతున్నది. స్పీడు రావటాసికి ఇక కీ బోర్డు వైపు చూడకుండా చేయాలి.
అచ్చులు గుర్తు పెట్టుకోవడం సులభం ఐతే, హల్లులుకి కొన్ని కొండగుర్తులు పై వరుస బహగదజడ అని అలాగే పరకతచట, మనవలస మననం చేసుకంటే సులభం.

ప్రస్తుతానికి అతుకులు కొద్దిగా నల్లగా ఐనవి. దాని ప్రకారం, పై వరుసలో ఆ నుండి ఝ వరకు
మధ్య వరుసలో ఓ నుండి థ వరకు , క్రింది వరుసలో ణళ శ ఎక్కువగా వాడినట్లు తెలుస్తున్నది.
నేను ఎక్కువగా చేతిలో మధ్య రెండు, మూడు వేళ్లు మాత్రమే వాడుతున్నాను.

rākeśvara said...

మనం ఆ రోజు హైదరాబాదులోని అదేదో సెంటర్లో వీటికోసం ప్రయత్నించడాన్ని గుర్తుపెట్టుకొని, మా మొఱ తట్టుకోలేక, మీరు ఇవి తయారు చేయడం చాలా దివ్యం (ఇంతకంటే గొప్ప పదం స్ఫురించలేదు)।

నేనూ వీవెన్ అనుకోవడమేగానీ, మాకు ఈ మాత్రం చేయవచ్చని కూడా తట్టలేదు। ఈ పద్ధతి బానేవుంది। నిజంగా ఇష్టమున్నవారు ఇది చేయవచ్చు। నేను నా పెన్ డ్రైవులోనున్న తెలుగు టూల్బాక్సు (icomplex.exe etc.) కు ఇది కూడా జెతచేస్తాను। ఎవరైనా అడిగితే వేంటనే ప్రింటు తీసి ఇవిగో అతికించుకోండి అని చెప్పవచ్చు :)

మాకు ఈ ష్టిక్కర్లు లేకపోవడం వల్ల, చూడకుండా బాగా అలవాటు అయి, అందుకోవడమే బాగా వేగంగా అందుకున్నాం। అన్ని వేళ్ళూ వాడడం వల్ల మొదట చిటికినవేలు నొప్పిపుట్టవచ్చుగాని, కొన్ని రోజులకే దానీకీ బలం వచ్చేస్తుంది।

నిన్ననే నేను నా కీబోర్డుని ఎడిట్ చేసుకొని "." బదులు "।" పెట్టుకున్నాను :)

౧ మామూలు పేపరు బదులు ష్టిక్కరు పేపరు వాడితే అతికించుకునే పనివుండదు।
౨ డబ్బాల మధ్యన కాళీలేకపోతే (ఎక్సల్ షీటు గ్రిడ్డులాగా), వాటిని ముక్కలుగా కోయడానికి పట్టేసమయం సగానికి తగ్గిపోతుంది।

rākeśvara said...

అన్నట్టు మీరు ఇలాంటి ఇన్నొవేషన్లు చేసినప్పుడు కాస్త telugu-computing గుంపుకు ఒక మెయిలు వేస్తే బాగుంటుంది। చాలా మంది బ్లాగులు ఎక్కువయి సరిగా అన్నిటినీ ఫాలో కాలేకపోతున్నారు।

Arjun said...

అక్షరం చూసి టైపు చేయటం నేర్చుకన్నాక వేగం బాగాతగ్గి పోయింది. తెలుగు అంతగా వాడుతుండకపోవటం వలనేమో, గంటకి 284 పదాలు మాత్రమే (లేక 2000 బైట్లు)చేయగలిగాను. పోతనలో నాలిగింతలు మెరుగుగా వుండేది. ఇంకొన్నాళ్లు ప్రయత్నిస్తాను.

వీవెన్ said...

మీరు వేగంగా టైపు చెయ్యాల్సిన పరిస్థితులు సృష్టించుకోండి. మిత్రులతో (IM) కబుర్లాడండి. వేగాన్ని వేగంగా పెంచుకోడానికి అదే మంచి మార్గం. నా టంకన వేగాన్ని అలానే పెంచుకున్నాను. సాధారణ అభ్యాసంలో వేగం నెమ్మదిగా పెరుగుతుంది. సాధారణ అభ్యాసాన్ని టైపాట్లు తగ్గించుకోడానికి, కబుర్లలాంటి బలవత్టంకనాన్ని (forcible typing) వేగం పెంచుకోడానికి ఉపయోగించుకోవాలి. నా రెండు పైనలు!

Arjun said...

వీవెన్,
మీ సలహాలకి ధన్యవాదాలు.
రాకేశ్వర్ మీకుకూడా, ఆలస్యానికి క్షమించాలి. ఇది రాసినప్పుడు, తెలుగు కంప్యూటింగ్ లేదేమో, తెలుగు బ్లాగు కి పంపించినట్లు గుర్తు.

ఈ బ్లాగు చదివినవారు వారు అనుసరించే పద్ధతి, అనుభవకాలం టైపు వేగం తెలిపితే మంచిది.

Unknown said...

భేష్! చాలా బాగుంది. మంచి ప్రయత్నం.

అయితే ఎప్పటిలాగే ఈ సారీ నేను ఇన్‌స్క్రిప్ట్ కి మారే అవకాశాలు తక్కువే :-)

వీవెన్ said...

అర్జున్, మీరు టంకన వేగాన్ని ఎలా కొలుస్తున్నారు? (ఏదైనా పరికరం సహాయంతోనా లేదా మానవీయంగానా)

నేను ఆంగ్లంలో అయితే నిమిషానికి 50 పదాలపైనే టైపించగలను. నా తెలుగు టంకన వేగాన్ని ఈ మధ్యలో కొలిచి చూడలేదు. బహుశా 40 పైన ఉండొచ్చు.

వీవెన్ said...

@ప్రవీణ్, ఇప్పుడే మారొద్దు! inscriptlayout.org సిద్ధమయి విడుదలయ్యే వరకూ వేచివుండండి. అప్పుడు మీ మార్పుని మేము ప్రచారానికి వాడుకుంటాం. ;-)