Pages

Saturday, November 21, 2009

ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకర్ల గణాంకాలు




ఫైర్ఫాక్స్ తెలుగు విడుదలై సంవత్సరం గడిచింది. 2009-11-17 వారానికి వాడుకర్ల గణాంకాలను పటంలో చూడండి.

మొత్తం వాడుకర్లు 2194 కాగా, దాదాపు 70 శాతం మంది భారత్ నుండి, అమెరికా నుండి 20 శాతం వున్నారు.
ఫైర్ఫాక్స్ లో బ్లాక్ లిస్ట్ అనే లక్షణం ద్వారా ఇవి సేకరించబడ్డాయి. దాదాపు 500 మంది వారానికి, ఫైర్ఫాక్స్ తెలుగు దించుకుంటున్నారు(downloads).
కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరు తప్పని సరిగా విహరిణి వాడతారు కాబట్టి, ఈ గణాంకాల్ని తెలుగులో కంప్యూటర్ వాడేవారి సంఖ్యకు సారూప్యంగా వాడుకోవచ్చు.

5 comments:

Anil Atluri said...

ఫైర్‌ఫాక్స్ 3.0.2 / 3.5.4 బేట విడుదలలకి మీ టపాలలో ఫైర్‌ఫాక్స్‌ ఫైర్‌ఫాక్స్‌గానే ఉంటూ, ఈ టపాలో "ఫైర్ఫాక్స్‌" గా ఎందుకని రూపాంతరం చెందిదో! :)

Arjun said...

అనిల్ గారు,
ఉబుంటు లో లోహిత్ తెలుగు ఖతితో ఫైర్ఫాక్స్ (సరిగా నకారపొల్లుతో అంతమవుతూ)వుంది. ఇక పైర్ ఫాక్స్ కలిసి లేకవిడిగా రావటానికి, ఆ పదం టైపు చేయటానికి వాడిన యూనికోడ్ ప్రత్యేక అక్షరాలు కారణం. ఫైర్ఫాక్స్ (ప్రత్యేక అక్షరాలు వాడకుండా) ఫైర్‌ఫాక్స్ లో ర్ తరువాత ZWNJ (కలపకుండా రావాలని సూచించే యూనికోడ్ U0x200C) ఫా కి ముందు వాడాను. పరభాషాపదాలు రాసేటప్పుడు, ప్రత్యేక యూనికోడ్ అక్షరాలు వాడి పరభాష ఉచ్ఛారణని తెప్పించాలా లేక సంయక్తాక్షర క్లిష్టతని తగ్గించడానికి మధ్యలో ఖాళీ అక్షరము లేక ప్రత్యేక అక్షరము వాడాలా అనేదానికి మనం ఇంకా ప్రామాణికత సాధించలేదు. మీరు విండోస్ లో చూస్తున్నట్లయితే, లేక వేరే ఖతి (పోతన, గౌతమి) వాడుతున్నట్లయితే, లేక భాష అనువర్తనాల(విండోస్ సాఫ్ట్వేర్, లినక్స్ సాఫ్ట్వేర్ లో) వేరు వేరుగా మార్పులుకి గురవటవలన మీకు ఇంతకు ముందు కనిపించిన రూపు ఇప్పుటి రూపుకి తేడావుండవచ్చు. వీటి రెండింటి మధ్య సారూప్యము లోపించటానికి ఇవి ఇంకా యూనికోడ్ లో లొసుగుల వలన,లేక తాజా విడుదల యూనికోడ్ ని ఇవి ఇంకా అమలుచేయకపోవటం కావచ్చు.

నా అనుభవంలో పోతన ఖతితో క్రిందటి సంవత్సరము ఉబుంటు లో ఫైర్ఫాక్స్ (సరిగా నకారపొల్లుతో అంతమవుతూ) ఇప్పుడు ఫైర్ఫాక్స తరువాత ్ (కలవని నకారపొల్లు) గా వుంది. దీనికి లినక్స్ భాషరూప సాఫ్ట్వేర్లో మార్పులు కారణం అవవచ్చు.
మీరు వాడే అపరేటింగ్ సిస్టమ్,భాష అనువర్తనము, ఫాంటు(ఖతి) వివరాలు తెలియచేస్తే సహాయంగా వుంటుంది.

Anonymous said...

naaku pothana khathi mariyu gowthami
khathi gurinchi peddaga teliyadu

Anonymous said...

nenu opensuse gatha rendu samvathsaramula nundi vaaduthunnanu
asalu nenu telugu bhashanu
anuvaada kriya ekkada nundi praarambhinchaali dayachesi telupa galaru.

Arjun said...

హలో 'One More blog is here to share'
పోతన గౌతమి గురించి వికీపీడియా లో వెతకండి.
స్థానికీకరణ గురించి మార్చినుండి లినక్స్ ఫర్ యు లో వ్యాసాలు రాస్తున్నాను. అవిచదివితే మీ ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు. మరిన్నివివరాలకు నా వ్యక్తిగతవెబ్సైటు వనరులపేజీ చూడండి.