Saturday, December 4, 2010
2010 లో ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకరులలో 90% తరుగుదల
ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకరుల గణాంకాలు పరిశీలించినట్లయితే గత సంవత్సరముతో పోల్చి చూస్తే 90% పడిపోయింది. అప్పడు 2194 వున్న వాడుకరుల సంఖ్య ప్రస్తుతం 218 మంది కి పడిపోయింది. జనవరి 2010 కే తరుగుదల జరిగింది. క్రోమ్ తెలుగు అందుబాటులో వచ్చినప్పుడు చాలా మంది దానికి మారారు అనిపిస్తుంది.
చూడండి 2009 గణాంకాలు విశ్లేషణ
5 comments:
గణాంకాలను తెలిపినందుకు కృతజ్ఞతలు కానీ ఈ గణాంకాలు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఒక ఏడాదిలో ఇంత మార్పా 2194 నుండి 218 పొంతన లేకుండా వున్నాయే...తెలుగులో ఫైర్ఫాక్స్ విహారిణి వుందని అసలు ఎంతమందికి తెలుసో...అసలు కారణాలను తెలుసుకోవలసిన అవసరం వుంది.
ప్రవీణ్,
ఫైర్పాక్స్ తెలుగు వాడకం తగ్గటానికి క్రోమ్-తెలుగు, ఇతర విహరిణల పోటీతో పాటు, ఫైర్ఫాక్స్ లోని దోషాలు (575051, 592628 కూడా కారణమవవచ్చు.
నిజమే అయ్యుండాలి,సాంకేతిక వివరాలు చెప్పలేను గానీ ఈ మధ్య ఫైర్ ఫాక్స్ బాగా విసిగిస్తుంది.
రాజేంద్రకుమార్ గారు,
ఫైర్ఫాక్స 4 త్వరలో రాబోతుంది. చాలా వేగవంతమైనదని విన్నాను. మీ ప్రస్తుత సమస్య వివరాలు తెలిపితే ఉపయోగంగా వుంటుంది.
ఇంతకు ముందు వ్యాఖ్యలో తెలిపిన బగ్గులు
(575051, 592628 ) ఫైర్ఫాక్స్ 4.0 బీటా 8 లో కనబడలేదు. ఇంక సంతృప్తిగా వాడుకోవచ్చు.
Post a Comment